Share News

kumaram bheem asifabad- నేడు జిల్లాకు గవర్నర్‌ రాక

ABN , Publish Date - May 28 , 2026 | 10:51 PM

ఆదివాసీల బానిస సంకెళ్లు తెంప డానికి పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మహావీరుడు కుమరం భీం, ఎడ్లకొం డు పుట్టిన గడ్డ అయిన రౌటసంకెపలిక్లి రాష్ట్ర ప్రథమ పౌరుడు శివప్రతాప్‌ శుక్లా శుక్రవారం రానున్నారు. హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్‌ నాగేంద్ర మండలంలోని రౌటసంకెపల్లిని దత్తత తీసుకున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోని పోరాట గ్రామంలో మెరుగైన వసతులు కల్పించాలన్న తలంపుతో కార్యక్రమానికి గవర్నర్‌ను గ్రామానికి తీసుకురావడంలో విజయం సాధించారు.

kumaram bheem asifabad- నేడు జిల్లాకు గవర్నర్‌ రాక
కుమరం భీం పుట్టిన గడ్డ రౌటసంకెపల్లి గ్రామం

- అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల బానిస సంకెళ్లు తెంప డానికి పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మహావీరుడు కుమరం భీం, ఎడ్లకొం డు పుట్టిన గడ్డ అయిన రౌటసంకెపలిక్లి రాష్ట్ర ప్రథమ పౌరుడు శివప్రతాప్‌ శుక్లా శుక్రవారం రానున్నారు. హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్‌ నాగేంద్ర మండలంలోని రౌటసంకెపల్లిని దత్తత తీసుకున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోని పోరాట గ్రామంలో మెరుగైన వసతులు కల్పించాలన్న తలంపుతో కార్యక్రమానికి గవర్నర్‌ను గ్రామానికి తీసుకురావడంలో విజయం సాధించారు. నాగేంద్ర గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. 25 నివాస గృహలు 125 మంది జనాభా ఉన్న గ్రామంలో ప్రతి ఒక్కరిని అక్షరాస్యు లుగా చేసే కార్యక్రమంలో భాగంగా పలక బలపం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గవర్నర్‌ రాక నేపథ్యంలో గ్రామానికి గ్రామస్తులు ఎప్పటి నుండో చూస్తున్న తారు రోడ్డు పూర్తి చేశారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం గవర్నర్‌ రానున్నారు. గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ హరిత ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దత్తత గ్రామంలో నిర్వహించనున్న వివిధ రకాల కార్యక్రమాలను గ్రామోత్సవ కమిటీ నాయకులు గుణవంత్‌రావు, సలహాదారు సిడాం అర్జు, కోఆర్డినేటర్‌ వెంకటేష్‌లు పర్యవేక్షిస్తున్నారు.

గవర్నర్‌ పర్యటన ఇలా..

రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఉదయం 10:35కు హెలికాప్టర్‌లో కలెక్టరేట్‌కు చేరుకొని అధికారులతో రెండు గంటల పాటు సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం మూడు గంటలకు గ్రామంలో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొననున్నారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. గ్రామంలో కుమరం భీం, ఎడ్లకొండుల 20 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. గ్రామంలో సోలార్‌ ప్యానల్‌, వీధి దీపాల ఏర్పాటు, ఆరోగ్యం కార్డులు, సంక్షేమ కార్డుల పంపిణీ చేయనున్నారు. మద్యపాన నిషేదంపై గ్రామస్తులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు.

Updated Date - May 28 , 2026 | 10:51 PM