యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: గవర్నర్ శుక్లా
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:56 AM
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా మత్తు వ్యసనానికి దూరం కావచ్చునని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చెప్పారు.
హైదరాబాద్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా మత్తు వ్యసనానికి దూరం కావచ్చునని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమరవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ-డ్రగ్ ఫ్రీ ఇండియా సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. తెలంగాణలో మాదకద్రవ్యాల కట్టడికి జరుగుతున్న యత్నాలను, అవగాహన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో ప్రతి విద్యార్థి చేత మత్తుపదార్ధాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించాలని ఆయన సూచించారు.