క్రీడలు జట్టు స్ఫూర్తికి దోహదపడతాయి
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:08 AM
క్రీడలు వ్యక్తిత్వ నిర్మాణం, జట్టు స్ఫూర్తికి, ఓర్పు, సహనాన్ని పెంపొందించుకుకోవడానికి దోహదపడతాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు.
ఐక్యత సాధించడానికే పీఎం సంసద్ ఖేల్ పోటీలు
భువనగిరి సభలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్యలు
యాదాద్రి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): క్రీడలు వ్యక్తిత్వ నిర్మాణం, జట్టు స్ఫూర్తికి, ఓర్పు, సహనాన్ని పెంపొందించుకుకోవడానికి దోహదపడతాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో జరిగిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుకు సమాన ప్రాధాన్యం దొరికితేనే నిజమైన, నాణ్యమైన విద్య వికసిస్తుందన్నారు. క్రీడలు పతకాల కోసం కాకుండా, దేశ పౌరుల్లో నడవడికను, ఆత్మవిశ్వాసాన్ని, ఐక్యతను సాధించడానికి ప్రధాని మోదీ పీఎం సంసద్ ఖేల్ మహోత్సవాలను చేపట్టారని శుక్లా చెప్పారు. పోటీల్లో విజేతలకు కేంద్రమంత్రి బీఎల్ వర్మతో కలిసి ఆయన బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.