ఏఐ-క్వాంటంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:20 AM
ఏఐ-క్వాంటం కలయిక విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ఉన్నత విద్యారంగాన్ని...
సెంట్రల్ జోన్ వీసీల సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఏఐ-క్వాంటం కలయిక విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ఉన్నత విద్యారంగాన్ని ఏఐ, క్వాంటం సాంకేతికతల దిశగా మలిచే లక్ష్యంతో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సును ఆయన ఓయూలో ప్రారంభించారు. ఠాగూర్ ఆడిటోరియంలో 2రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ‘ఏఐ, క్వాంటం టెక్నాలజీ ఆధారిత ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం’ అనే ఇతివృత్తంతో చర్చలు జరుపుతున్నారు. నైతిక విలువలను ప్రతిబింబించే ‘మేడ్ ఇన్ ఇండియా’ ఏఐ నమూనాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని జిష్ణుదేవ్ వర్మ నొక్కి చెప్పారు. తెలంగాణతో పాటు ఛత్తీ్‌సగఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా వీసీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.