Share News

Governor Jishnu Dev Varma: స్వదేశీ నావికా సామర్థ్యాల తీరు భేష్‌

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:53 AM

ఆత్మనిర్భరత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తూర్పు నావికాదళం సామర్థ్యం పెంపుదల కోసం కార్యాచరణ రూపొందించి అమలు చేయడం అభినందనీయమని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ....

Governor Jishnu Dev Varma: స్వదేశీ నావికా సామర్థ్యాల తీరు భేష్‌

  • గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

  • ‘ఐఎన్‌ఎస్‌ హిమగిరి’ సబ్‌మెరైన్‌ సందర్శన

అల్వాల్‌/విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆత్మనిర్భరత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తూర్పు నావికాదళం సామర్థ్యం పెంపుదల కోసం కార్యాచరణ రూపొందించి అమలు చేయడం అభినందనీయమని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం సందర్శనలో భాగంగా అధునాతన స్టెల్త్‌ ప్రిగేట్‌ కల్వరి క్లాస్‌ సబ్‌మెరైన్‌ ‘ఐఎన్‌ఎస్‌ హిమగిరి’ని ఆయన సందర్శించారు. భారత నావికా ఇంజనీరింగ్‌ సామర్థ్యంతో నిర్మించిన ఈ సబ్‌మెరైన్‌ పనితీరును ఆయన ప్రశంసించారు. దేశసముద్ర జలాల రక్షణలో తూర్పు నావికాదళం సామర్థ్యం పెంపుదలకు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన సబ్‌మెరైన్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నిరంతరం సముద్ర జలాల్లో నిఘా కొనసాగించడంలో నావికాదళాల అచంచలమైన అంకితభావంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తూర్పునావికాదళం పనితీరు, సబ్‌మెరైన్‌లో అత్యాధునిక స్టెల్త్‌ డిజైన్‌, దాంట్లో ఇంటిగ్రేటెడ్‌ అడ్వాన్స్‌డ్‌ కంబాట్‌ సిస్టమ్‌ ప్రాధాన్యతను నావికాదళ ఉన్నతాధికారులు గవర్నర్‌కు వివరించారు.

Updated Date - Jan 05 , 2026 | 02:53 AM