Share News

kumaram bheem asifabad- రోడ్డు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:30 PM

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై అలైవ్‌-అరైవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పోలీసుశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ హెల్మెట్‌ ఆకారం నిర్మాణం హెల్మెట్‌చౌక్‌ను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటి భరోసా కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి వీఓఏసీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంబించారు.

kumaram bheem asifabad- రోడ్డు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటుతున్న డీజీపీ శివధర్‌రెడ్డి

ఆసిఫాబాద్‌రూల్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై అలైవ్‌-అరైవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పోలీసుశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ హెల్మెట్‌ ఆకారం నిర్మాణం హెల్మెట్‌చౌక్‌ను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటి భరోసా కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి వీఓఏసీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంబించారు. అలాగే వాంకిడి మండలంలో నిర్మిస్తున్న ఫైరింగ్‌రేంజ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో అందరిని భాగస్వాములు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నామవుతున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి 7,500 మంది మృతి చెందారని చెప్పారు. రోడ్డు భద్రత కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకొని ప్రతి జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచేందుకు పోలీసుశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్‌చౌక్‌ ఒక ప్రతీకగా నిలు స్తుందన్నారు. హెల్మెట్‌ వినియోగం ప్రాణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రతి వాహనదారుడు ట్రాఫిక్‌ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మావోయిస్టుల అంకం ముగిసిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నట్లు తెలిపారు.. గతంలో మావోయిస్టులతో ముప్పు ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులకు కేటాయించిన గన్‌మెన్‌లను తొలగిస్తాని తెలిపాలు. కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్‌, ఏఎస్పీ చిత్తరం జన్‌, డీఎస్పీ వహీదుద్దీన్‌, సీఐలు బాలాజీ వరప్రసాద్‌, రమేష్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:30 PM