Share News

పేదలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:25 PM

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీ ఐ) జాతీయ సమితి పిలుపులో ఆగస్టు 6 నుం చి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం ఐదో రోజు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనసాగింది.

పేదలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి
తాడూరు : మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలనరసింహ, వార్ల వెంకటయ్య

- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలనరసింహ, వార్ల వెంకటయ్య

తాడూరు/ కోడేరు/ తెలకపల్లి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీ ఐ) జాతీయ సమితి పిలుపులో ఆగస్టు 6 నుం చి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం ఐదో రోజు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. తాడూరు మండలం గుంతకోడూరు, పానగల్‌, సిర్సవాడ, ఐతోల్‌, భలాన్‌పల్లి, గోవిందాయపల్లి, ఎట్టిధార్‌పల్లి, అంతారం, యాదిరెడ్డిపల్లి, ఆకునెల్లి కుదురు, యంగంపల్లి, మేడిపూర్‌, పొల్మూరు, గుట్టలపల్లి, అల్లాపూర్‌ మీదుగా, మండల కేం ద్రమైన తాడూరుకు చేరింది. సీపీఐ తాడూరు మండల కార్యదర్శి ఎండీ కుతుబుద్దీన్‌ అధ్యక్షత న జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు బాలనరసింహ, వార్ల వెంకటయ్య మాట్లాడా రు. కోడేరు మండలంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎస్‌డీ ఫయాజ్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర ని ర్వహించారు. మండలంలోని కోం డ్రావుపల్లి, పసుపుల గ్రామాలలో సీపీఐ జెండాలు ఆవిష్కరించారు. తెలకపల్లి మండలం చిన్నముద్ద నూరు, రామ్‌రెడ్డిపల్లి, కార్వంగా, తాళ్లపల్లి, నడిగడ్డ, రామగిరి, గౌరా రం,పర్వతాపురం, రాకొండ, గ్రామా లలో పాదయాత్ర కొనసాగింది. సీపీ ఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు సూర్యశం కర్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సభజరగగా ఎం.బా లనరసింహ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యు డు కె.కేశవులు గౌడ్‌ పాల్గొన్నారు. ఆయా సభల్లో నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకు శపోకడల వల్ల పేదప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలపైన వి వక్ష చూపడం బీసీ ప్రధానిగా చెప్పుకునే మోదీకి తగదన్నారు. బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వి ఽధానాలను అవలంభిస్తే దేశంలో ఆర్థిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేస్తోందని ఆరోపించారు. తా డూరు కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ స భ్యుడు మారేడు శివశంకర్‌, ఉప సర్పంచ్‌ రామ కృష్ణ, నాయకులు వెంకటస్వామి, చంద్రయ్య గౌడ్‌, నిరంజన్‌గౌడ్‌, శ్రీనివాసులు, కోడేరు కార్య క్రమంలో నాయకులు బండి లక్ష్యం, కిరణ్‌కు మార్‌, రాములు, వెంకటయ్య, తెలకపల్లి కార్యక్ర మంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు బాలము రళీకృష్ణ, మారేడు శివశంకర్‌, నాయకులు వేనే పల్లి రవీందర్‌, ఆంజనేయులు, స్వామి, విష్టు, నరేందర్‌రెడ్డి, మల్లయ్య, నరసింహ, కేశవులు, రాములు, పూసల నరసింహ పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:25 PM