ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:33 PM
మండలంలోని పర్వతాయి పల్లి గ్రామంలో ఆదివారం నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోద ర్‌రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు.
- గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ
తాడూరు, జనవరి25 (ఆంధ్రజ్యో తి) : మండలంలోని పర్వతాయి పల్లి గ్రామంలో ఆదివారం నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోద ర్‌రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సమస్యలు పరిష్కరించు కుంటూ అభివృద్ధి చేయడం జరుగుతుందని అ న్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గ్రామాల్లో పేద ప్రజలు ఇబ్బం దులకు గురి కాకూడదని ప్రతీ కుటుంబానికి 200యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పం చ్ భీముడు, కాంగ్రెస్ పార్టీ మండల నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.