సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:49 PM
ప్రజల సంక్షేమమే పరమావధిగా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నా రు. గురువారం మండలంలోని టేకుమట్ల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చే సిన గ్రామసభకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు.
కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సంక్షేమమే పరమావధిగా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నా రు. గురువారం మండలంలోని టేకుమట్ల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చే సిన గ్రామసభకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, అభివృద్థి సంక్షేమ పథకలను అమలు చేస్తూ అర్హులైన లబ్దిదారులకు ఫలాలు అం దించే విధంగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, అర్హు లైన వారికి రేషన్ కార్డులు అందించి సన్నబి య్యం అందిస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ. 13 వేల కోట్లను ఖర్చు చేసిందని, ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలోభాగంగా అభివృద్ధి పనులు, పారిశుధ్య్ద పనులు, తాగునీటి సరఫరా అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రజలు పలు సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు సుచరిత, జిల్లా వ్యవసాయాధి కారి సురేఖ, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచు పల్ల వెంకటేష్, ఉపసర్పంచు ప్రవీణ్‌కుమార్ తదితరు లు పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు.