పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:34 PM
పే దల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే వంశీకృష్ణ
వంగూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : పే దల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని కొం డారెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇం దిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇంది రమ్మ పథకం ద్వారా ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలి పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రాం కొండారెడ్డిపల్లి రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోం దన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయ న్నారు. కార్య క్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు కేవీఎన్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి, సర్పంచ్ మల్లెపా కుల వెంకటయ్య, ఉపసర్పంచ్ వేమారెడ్డి పాల్గొన్నారు.
ఫ లింగాల, (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాం త పాఠశాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మాడాపూర్ గ్రామంలో సర్పంచ్ శేఖర్‌తో కలిసి రూ.30 లక్షల వ్యయంతో పాఠశాల బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. సర్పంచులు, నాయకులు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.