విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:37 PM
ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మహాత్మాజ్యోతిబాపూలే వసతి గృహ నిర్మాణానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి శంకుస్ధాపన చేశారు.
కలెక్టర్ కుమార్ దీపక్
తాండూర్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మహాత్మాజ్యోతిబాపూలే వసతి గృహ నిర్మాణానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, ప్రహారీ గోడ, మూత్రశాలలు ఇతర పూర్తి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ క్రమంలో తాండూర్‌లో రూ. 1.95 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులతో మహాత్మాజ్యోతి బాపూలే వసతి గృహ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతన వసతి గృహం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీవో శ్రీనివాస్, మహాత్మాజ్యోతిబాపూలే ఆర్‌సీవో బాల భాస్కర్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.