kumaram bheem asifabad- అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:51 PM
అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటం జరుగుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ, మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఆసిఫాబాద్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, డాక్టర్ హరీష్ బాబులతో కలిసి హాజరయ్యారు
ఆసిఫాబాద్, ఆగస్టు 18 (ఆంఽధ్రజ్యోతి): అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటం జరుగుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ, మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఆసిఫాబాద్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, డాక్టర్ హరీష్ బాబులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించనున్నామని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాలకు సమానంగా కేటాయించామని వివరించారు. అర్హులైన నిరుపేదలకు ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యం ఇద్దామని తెలిపారు. మైనార్టీ మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్నామని, చెప్పారు. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ కోసం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లో పర్యాటక రంగ అభివృద్దికి నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్ష పాతం అవుతున్న నేపథ్యంలో రైతు సంక్షేమం దృష్ట్యా వట్టివాగు ప్రాజెక్టు నుంచి సాగు నీరు అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతను పాటించామని అన్నారు. అనర్హులకు ఇళ్లు మంజూరు జరిగితేకలెక్టర్ దృష్టికి తీసుకరావాలన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో మంజూరు చేసిన పనులు నేటికి ప్రారంభం కాలేదన్నారు. అటవీ అధికారులు అభివృద్ధి పనులు జరుగకుండా అడుగుగడునా అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ ఈసుగాం శివమల్లన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, అభివృద్ధి పనుల విషయంలో అటవీ అధికారులు ఇబ్బందులు చేస్తున్నారని జిల్లా అటవీ శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డీఆర్‌వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాం నాయక్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్లు ఆకాష్, షాహిన్ సుల్తానా, మార్కెట్ కమిటి చైర్మన్లు మంగ, దేవయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం..
మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నియోజకవర్గంలో గతంలో కొబ్బరికాయాలు కొట్టి శంకుస్థాపనలు చేసిన పనులు నేటికి ప్రారంభం కాలదేని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. దీంతో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2018 నుంచి 2023 మధ్య డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని పూర్తి అయ్యాయని ఎమ్మెల్యేను మంత్రి ప్రశ్నించారు. రూ.5లక్షలు పెడితే కాంట్రాక్టర్లు ముందు రాలేదని గతంలో మీరే చెప్పారని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య కాస్తవాగ్వావాదం జరిగింది. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లుకేటాయిస్తే ఇప్పటి వరకు ఎన్ని పూర్తి అయ్యాయచని ఎమ్మెల్యే ప్రశ్నించారు.