Telangana Govt: జేఎన్‌టీయూ కాలేజీలకు సొంత భవనాలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:26 AM
జేఎన్‌టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ సిటీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భవనాల నిర్మాణానికి ముహుర్తాలు ఖరారయ్యాయి. వనపర్తి జేఎన్‌టీయూ కాలేజీ భవన నిర్మాణానికి వర్సిటీ అధికారులు ఈనెల 13న (మంగళవారం) శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, ఖమ్మం జిల్లాలోని పాలేరు జేఎన్‌టీయూ కాలేజీ భవన సముదాయాలకు ఈనెల 18న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు కాలేజీకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చొరవతో ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది.