kumaram bheem asifabad- హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:11 PM
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.
వాంకిడి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని చెప్పారు. నిరుపేదలు, రైతులు, మహిళలు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్నులే నారాయణ, కమలేష్, ఉప్పల కృష్ణ, సెల్వట్‌కార్ పెంటు, మారుతి, గుండయ్య, అజుముద్దీన్, చాంద్‌పాషా, విలాస్, అనిల్, అన్నారావు, ధర్ము, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెనలో గురువారం కాంగ్రెస్ నాయకులు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చివెయ్యి రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడుు ప్రకాష్‌రావు, అధికార ప్రతినిధి రవీందర్, పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ గౌడ్, సోమశేఖర్, చిరంజీవి, ప్రభాకర్, విజయ తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సుజాయిత్ ఖాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ పలు వీధుల గుండా సాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వెయ్యి రోజులు పూర్తి చేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, మోహర్లే, బాపురావు, రాథోడ్ సుదర్శన్, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.