చెత్త మాదిరిగా పారేశారు
ABN , Publish Date - Jul 18 , 2026 | 06:03 AM
ఈ ఫొటోలో మట్టికుప్పల మీద ఉన్న సంచులను చూడండి..!! అవేవో చెత్తాచెదారంతో నిండి ఉన్న సంచులు అనుకుంటే మాత్రం పొరపడినట్టే.
తాండూరులో రోడ్డు పక్కన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్తులు
ఈ ఫొటోలో మట్టికుప్పల మీద ఉన్న సంచులను చూడండి..!! అవేవో చెత్తాచెదారంతో నిండి ఉన్న సంచులు అనుకుంటే మాత్రం పొరపడినట్టే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సర్కారు సరఫరా చేసిన యూనిఫామ్‌లు ఆ సంచుల్లో ఉన్నాయి. ఆ ఏముందిలే అవేవో పాత దుస్తులు అయ్యి ఉంటాయిలే..!! అని లైట్ తీసుకుంటే.. మళ్లీ పొరపడినట్టే.. ఎందుకంటే అందులో ఉన్నవి కొత్తగానే ఉన్నాయి...!! వికారాబాద్ జిల్లా తాండూరు బైపాస్ రోడ్డులో రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులెవరో ఈ సంచులను పారేశారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తుంది. పాఠశాలలకు యూనిఫామ్‌లు ఇంకా పూర్తి స్థాయిలో చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దుస్తులు రోడ్డు పక్కన కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థులకు చేరాల్సిన దుస్తులను ఇలా రోడ్డు పాలు చేసిందెవరో కనిపెట్టి వారిని శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
- ఆంధ్రజ్యోతి, తాండూరు