Share News

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:42 PM

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

రాష్ట్ర కార్మిక,గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి

భీమారం, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బోయవాడలో రూ. 10 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో, ఆవడం క్రాస్‌ రోడ్డు సమీ పంలోని యాదవ కాలనీలో రూ. 5 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో డ్రైనేజీ ప నులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రా ధాన్యత ఇస్తుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్థి కార్య క్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేద కుటుంబాలకు గౌరవ ప్రదమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమ లు చేస్తుందని, పేద వారి సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, సర్పంచు ఉష్కమల్ల విజయలక్ష్మీ, మండల పార్టీ ప్రెసిడెంట్‌ పోడేటి రవి, నాయకులు పున్నంచంద్‌, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:42 PM