విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:54 PM
విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా విద్యార్థుల సౌకర్యార్ధం షె డ్యూల్డు కులముల వసతి సంక్షేమ గృహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
జైపూర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా విద్యార్థుల సౌకర్యార్ధం షె డ్యూల్డు కులముల వసతి సంక్షేమ గృహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో షెడ్యూల్డు కులముల సంక్షేమ వసతి గృహ నిర్మాణానికి కలెక్టర్ కుమార్ దీపక్, డీ సీపీ భాస్కర్, షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు దుర్గా ప్రసాద్‌తో కలిసి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ షెడ్యూల్డు కులముల విద్యార్థుల సంక్షేమం కోసం రూ. 1.80 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో వసతి గృహ నిర్మాణం చేపడుతున్నామ న్నారు. చెన్నూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 2 కోట్ల నిధుల తో అభివృద్ధి పనులను చేపట్టామని, రూ. 1.50 కోట్లతో జూనియర్ కళాశాలల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీపతి బాపురావు, తహసీల్దార్ వనజారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, మం డల పార్టీ అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మ న్ తివారీ, సర్పంచు కూన భాస్కర్ పాల్గొన్నారు.