Share News

గ్రామీణ వైద్యులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:35 PM

ని రంతరం గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులకు తెలం గాణ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు

గ్రామీణ వైద్యులకు అండగా ప్రభుత్వం
గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

- స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేట, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ని రంతరం గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులకు తెలం గాణ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేట నియోజకవ ర్గంలోని గ్రామీణ వైద్యులకు అవగాహన సద స్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ, ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య రంగ సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తు న్నట్లు తెలిపారు. గ్రామీణ వైద్యు లు పాల్గొన్నారు.

హాస్టల్‌ వసతి కోసం వినతి

బల్మూరు, (ఆంధ్రజ్యోతి) : కొం డనాగులలోని శ్రీ ఉమామహే శ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కళాశాలకు హా స్టల్‌ మంజూరు చేయాలని కోరుతూ కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు బుధవారం వినతిపత్రం అంద జేశారు. కళాశాలలో అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వర్గా లకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదు వుకుంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్‌ రవి తెలి పారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో దోహదప డుతుందని ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతి పత్రంలో విన్నవించు కున్నట్లు తెలిపారు. అదేవిధంగా కళాశాల మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థు లకు అవసరమైన సదుపాయాల కల్పన కోసం సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అం దించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 11:35 PM