Share News

ఆర్టీసీ కార్మికుల గౌరవాన్ని కాపాడుతున్న ప్రభుత్వం

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:41 AM

ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి కార్మికుల గౌరవాన్ని కాపాడుతున్నాడని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ నుంచి భద్రాచలం వరకు నూతన బస్‌ సర్వీసులను సోమవారం

ఆర్టీసీ కార్మికుల గౌరవాన్ని కాపాడుతున్న ప్రభుత్వం
భద్రాచలం బస్సు సర్వీసును ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి కార్మికుల గౌరవాన్ని కాపాడుతున్నాడని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ నుంచి భద్రాచలం వరకు నూతన బస్‌ సర్వీసులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన విప్‌ జెండా ఊపి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆది శ్రీనివాస్‌ ముందుగా ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె సందర్భంగా మృతి చెందిన శంకర్‌ గౌడ్‌ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజన్న క్షేత్రం నుంచి నూతన బస్‌ సర్వీసులు ప్రారంభం చేసుకోవడం శుభపరిణామం అన్నారు. ఇటీవల శ్రీశైలంకు నూతన బస్‌ సర్వీసులు ప్రారంభం చేసుకున్నామని గుర్తు చేశారు. త్వరలోనే బాసరకు నూతన బస్‌ సర్వీస్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్మకులు సమ్మె జరిగినప్పుడు వారి సమస్యను వారి జీవితంగా చూస్తే, మరి కొందరు రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయం చేశారని విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 56 రోజుల సమ్మె చేస్తే వారిని సెల్ఫ్‌ డిస్మిస్‌ చేస్తామని బెదిరించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేవలం మూడు రోజుల్లోనే ముగింపు పలికారని గుర్తుచేశారు. సమావేశంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, కౌన్సిలర్లు ఐల శ్రీనివాస్‌, తూం మధు, కొండ రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:41 AM