Share News

ప్రజల పాలిట శాపంగా ప్రభుత్వ విధానాలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:34 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు రానున్న రోజుల్లో శాపంగా మారనున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పేర్కొన్నారు.

 ప్రజల పాలిట శాపంగా ప్రభుత్వ విధానాలు

మందమర్రిటౌన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు రానున్న రోజుల్లో శాపంగా మారనున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పేర్కొన్నారు. ఆదివారం మందమర్రిలోని సీఈఆర్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నాలుగు లే బర్‌ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికులకు నష్టం చేకూర్చిందన్నారు. ఇవి అమ లైతే కార్మికులకు ఉద్యోగ భద్రత, హక్కులపై మాట్లాడే అవకాశాలే ఉండ వన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ఇటీవల పార్ల మెంట్‌లో విత్తన చట్టాలను తీసుకువచ్చారన్నారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కేవలం ఆదానీ, అంబానీల ఆస్తు లను పెంచేందుకు ప్రయత్నిస్తుందని, సామాన్య ప్రజలను పట్టించుకోవ డం లేదన్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వాటి అమలు కో సం యత్నిస్తున్నారన్నారు. ఒక వైపు లేబర్‌ కోడ్‌లు, మరో వైపు రైతు విత్త నచట్టం తీసుకువస్తున్నారని తెలిపారు. ఉత్పత్తి రంగాలకు సంబంధిం చిన రైతులు, కార్మికులను తీవ్రంగా అణిచవేయడానికి కేంద్రం చూస్తుందన్నా రు. ఇప్పటికే బొగ్గు పరిశ్రమలు లేకుండా చేసే కుట్రలు మొదలయ్యాయ న్నారు. రానున్న రోజుల్లో కార్మిక, కర్షకుల హక్కుల సాధన కోసం తమ యూనియన్‌ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సమా వే శంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, మంద నర్సింహా రావు, నాగరాజు గోపాల్‌, సీఐటీయూ ఉపాధ్యక్షుడు భూపాల్‌, 11 ఏరియా ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మందమర్రి ఏరియా అధ్యక్ష, కార్యదర్శు లు వెంకటస్వామి, అల్లి రాజేందర్‌, రామగిరి రామస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 11:34 PM