Share News

విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:13 PM

విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలను సందర్శించారు.

విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు
చెన్నూరులో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రబుత్వం చర్యలు తీ సుకుంటుందన్నారు. పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంత రం సాం ఘీక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి అధికారుల కు పలు సూచనలు చేశారు. కస్తూర్భా గాంధీ విద్యాలయా న్ని సందర్శించి అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సోమ నపల్లి గ్రామంలోని ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులను పరిశీలించి త్వరగా పనులను చేయాలని సూచించా రు. అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణాన్ని పరిశీలించి వేగ వంతంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనుల పురోగతి వివరాలను సమీక్షించారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం చెన్నూరు పట్టణంలో అమృత్‌ 2.0 పథకం కింద చేపట్టిన నీటి ట్యాంకు నిర్మాణ పనులను మున్సిపల్‌ కమీషనర్‌ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు.పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మోహన్‌, ఎంపీవో అజ్మత్‌ ఆలీ, సంబంధిత అధికారులు ఉన్నారు. 31 భీమిని 16 కేజీబీవీలో పాఠశాల గదులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

భీమిని, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చే సుకోని ఉన్నత స్థాయికి ఎదుగాలని జిల్లా అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో పి. చంద్రయ్య అన్నారు. మంగళవారం భీ మిని మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల ఆశ్రమ పా ఠశాలను, ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. పాఠశాలల్లో తరగతి గదులను, గ్రంథాలయం, సైన్స్‌ ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌ గదులలో సౌక ర్యాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న విద్యా వాతావ రణం, మౌలిక వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటూ అధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని వినియోగించుకోని పోటీ ప్రపంచంలో రాణించేందుకు సిద్ధం కావాలన్నారు. అనంతరం భీమిని ఉన్నత పాఠశాలలో ఈజీ ఎస్‌ పథకం ద్వారా మరుగుదొడ్డి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా భీమిని ఉన్నత పాఠశాలలో బీఎల్‌ఏల సమావేశంలో పాల్గొని ప్రత్యేక సవర ణ పర్యవేక్షణలో భాగంగా బీఎల్‌ఏలు తమ బూత్‌ పరిధిలో ఉండి తప్పులు జరగకుండా చూసుకోవాలని, 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి ఓట్లు తొ లగింపు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లను తొల గించడంపై బీఎల్‌ఏలు పూర్తి వివరాలను సేకరించా లన్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగా మోహన్‌, తహ సీల్దార్‌ బికర్ణ దాస్‌, సర్పంచ్‌ బండి శ్రీకాంత్‌ గౌడ్‌, ఎంపీఓ మహేష్‌, ఎంఈఓ వెంకటస్వామి, కేజీబీవీ ప్రత్యేకాధికారి పు ప్పాల దివ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 11:13 PM