Share News

kumaram bheem asifabad- ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు

ABN , Publish Date - Jul 26 , 2026 | 10:13 PM

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.. కాగజ్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు

kumaram bheem asifabad- ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం

కాగజ్‌నగర్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.. కాగజ్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ఆయా పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఉద్యమకారుడిని గుర్తించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ కారులు ఎవరు కూడా ప్రలోభాలకు లోనుకావద్దని తెలిపారు. జీవో 679 ద్వారా కమిటీ వేసినట్టు తెలిపారు. ఇందుకు ఛైర్మన్‌గా కేశవ్‌రావు ఉన్నారని వివరించారు. తనతో పాటు దయాకర్‌, రామన్‌దయాకర్‌, అద్దంకి దయాకర్‌, పొన్నం ప్రభాకర్‌, శోభన్‌రెడ్డితో పాటు పలువురు కమిటీలో ఉన్నారని చెప్పారు. ప్రతి ఉద్యమ కారుడిని గౌరవించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యమకారుల జాబితాను రూపొందిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని ఆయా సంఘాల నాయకులు సన్మానించారు. హైదరాబాద్‌ నుంచి రైలు ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి స్థానిక తెలంగాణ ఉద్యమ కారుల సంఘం నాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 1969 తెలంగాణ ఉద్యమ కారులను ఘనంగా శాలువలతో సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను సన్మానించారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమ కారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 10:13 PM