కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
ABN , Publish Date - May 01 , 2026 | 11:15 PM
:కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్ర వారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన మే డే వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, మే 1 (ఆంధ్రజ్యోతి) :కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్ర వారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన మే డే వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అసంఘటిత కార్మి కుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ప్రమాద రీత్య మరణించిన 102 కా ర్మికుల కుటుంబాలకు సుమారు రూ. 60కోట్లు, సహజ మరణం పొం దిన 223 కుటుంబాలకు సుమారు రూ. 24కోట్లు, పెళ్లి ప్రోత్సాహం కింద 993 మందికి సుమారు రూ. 30 కోట్లు, ప్రసూతి ప్రోత్సాహం కింద 1,646 మందికి సుమారు రూ. 49 కోట్లు, దివ్యాంగత్వం పొందిన వారికి సుమారు రూ. 68 కోట్లు అందజేశామన్నారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కార్మిక శాఖకు చెందిన సత్యనారా యణ, రమేష్, శివాజీలకు అవార్డులు అందించారు. అనంతరం జిల్లాలోని ఎంఎన్‌ఆర్ ఈజీఎస్ పనుల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ మంజూరు చేసిన కంప్యూటర్లను ఎంపీడీవోలకు అందజే శారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, అ దనపు కలెక్టర్ చంద్రయ్య,, మేయర్ దర్ని మధు కర్, డిప్యూటి మేయర్ సల్ల రమ్య, కార్మికశాఖ సహాయ కమీషనర్ క్రాంతి, జిల్లా అధికారులు సురేఖ, రౌఫ్‌ఖాన్, దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.