Share News

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:28 PM

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. ఆదివారం మండ లంలోని పెరికపల్లి గ్రామంలో రూ.10లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు.

 గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి
గ్రామసమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులను శంఖు స్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

బెల్లంపల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. ఆదివారం మండ లంలోని పెరికపల్లి గ్రామంలో రూ.10లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు. ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్య భవనాలు నిర్మించి మహిళ సంఘాల అభి వృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధితోనే గ్రామ స మస్యలు పరిష్కారమవుతాయని ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో మౌలి క సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతకుముందు పట్టణంలోని క్యాం ప్‌ కార్యాలయంలో వేమనపల్లి మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నా యకులు, వార్డు మెంబర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయ కులు నాతరి స్వామి, కారుకూరి రాంచందర్‌, పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:29 PM