Share News

మద్దతు ధరతో పంటలను కొంటున్న ప్రభుత్వం

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:14 PM

రైతులు పండి ంచిన పంటలను ప్రభుత్వం మ ద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న దని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి అన్నారు.

మద్దతు ధరతో పంటలను కొంటున్న ప్రభుత్వం
తాడూరు పీఏసీఎస్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

తాడూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండి ంచిన పంటలను ప్రభుత్వం మ ద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న దని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి అన్నారు. శనివారం మం డల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో మొక్కజొన్న కొ నుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగిలో రైతు లు సాగు చేసిన మొక్కజొన్న పంటను అన్ని గ్రామాలలో కొనుగోలు చేస్తారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన రూ.2400కు క్వింటాల్‌ మొక్కజొన్న కొనుగోలు చేస్తారని తెలి పారు. యాసంగిలో మొక్కజొన్న సాగువిస్తీర్ణం గణనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వమే కొనుగో లు చేస్తుందన్నారు. ప్రతీ రైతు మొక్కజొన్నలో తేమ శాతం లేకుండా కొనుగోలు కేంద్రం వద కు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు. వి క్రయించుకున్న రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు జిరాక్స్‌, ఏఈవో ధ్రువీకరించిన టోకెన్‌ను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ ఇన్‌చార్జి గణేష్‌, ఏవో సందీప్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు యార రమేష్‌, సర్పంచ్‌లు సంద మల్లయ్య, వెంకటయ్య, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, సిం ల్‌ విండో మాజీ చైర్మన్‌ రామచంద్రారెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఇన్‌చార్జి సీఈవో శివ, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

పేదల సొంతింటి కల సాకారం చేస్తాం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల సాకారం చేయడం కాంగ్రెస్‌ ప్ర భుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని ఆరోవార్డు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎమ్మె ల్యే ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారు లకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందు తున్నాయని పేర్కొన్నారు. అనంతరం అదే వా ర్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రా న్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్య క్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, వైస్‌ చైర్మన్‌ బాదం రమేష్‌, వార్డు కౌన్సిలర్‌ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:14 PM