విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:48 PM
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీ ట వేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బ్రాంచ్ స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీ ట వేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బ్రాంచ్ స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మంది పేద విద్యా ర్థులు విద్యనభ్యసిస్తున్నారని వీరందరికి పౌష్టికాహారం అందజేయాలన్నారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో అల్పాహార పథకం ప్ర భుత్వం తీసుకువచ్చిందన్నారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూని యర్ బాలికల కళాశాలలో అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. క ళాశాల విద్యార్ధినీలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల న్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గంలోని ఆయా మండలాల లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, కాం గ్రెస్ పట్టణాధ్యక్షుడు బండి ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.