మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:35 PM
రాష్ట్ర ప్రభుత్వం మహిళల అ భ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే వంశీకృష్ణ - మహిళా సమాఖ్య భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన
చారకొండ, జూలై 2 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర ప్రభుత్వం మహిళల అ భ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మండల మహి ళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎన్ ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి రూ. 30 లక్షలు మంజూరు కాగా, గురువా రం మండల కేంద్రంలో ఎమ్మెల్యే భూ మిపూజ చేసి పనులు ప్రారంభించా రు. అదేవిధంగా కేజీబీవీ నూతన కళాశాలను ప్రారంభించి, ప్రహరి నిర్మాణానికి రూ. 1.14 కోట్లతో శంకుస్థాపన చేశారు. కేజీబీవీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎ మ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందని అన్నారు. ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వం అందిస్తు న్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం రైతు వేదికలో రైతులకు పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో తహసీల్దార్ ఉమ, డీఈవో రమేశ్‌బాబు, ఎంఈవో ఝాన్సీరాణి, ఎంపీడీవో శంకర్‌నాయ క్, మండల వ్యవసాయశాఖ అధికారి తనూజ రాజ్, ఈఈ రాంచందర్, కాంగ్రెస్ మండల అ ధ్యక్షుడు భీముడు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అ ధ్యక్షుడు గుండె వెంకట్‌గౌడ్, డీసీసీ ప్రధాన కా ర్యదర్శి జమ్మికింది బాల్‌రాంగౌడ్, నాయకులు నాయిని జైపాల్, మహేందర్, నర్సింహారెడ్డి, పా నుగంటి అంజయ్య, గణేష్‌గౌడ్, గోరటి శివ, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మహిళా సంఘాల అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు.
రైతులకు విత్తన ప్యాకెట్ల పంపిణీ
వంగూరు, (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం రైతు ఆదాయాన్ని పెంచడం పత్తి దిగుబడులు, నా ణ్యతను మెరుగుపరుచడమే లక్ష్యంగా మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటి పథకాన్ని అమలు చే స్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువా రం మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో రైతులకు పత్తి విత్తన ప్యాకెట్లను రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు కేవిఎన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏవో ప్రియదర్శిని, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో శారద, రైతులు పాల్గొన్నారు.