Share News

‘ఇంటర్‌’ ఇన్విజిలేటర్ల భత్యం పెంపు

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:39 AM

ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఇన్విజిలేటర్లు, పేపర్‌ వ్యాల్యుయేషన్‌ సిబ్బంది గౌరవ భత్యాన్ని ప్రభుత్వం పెంచిది.

‘ఇంటర్‌’ ఇన్విజిలేటర్ల భత్యం పెంపు

  • 25శాతం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఇన్విజిలేటర్లు, పేపర్‌ వ్యాల్యుయేషన్‌ సిబ్బంది గౌరవ భత్యాన్ని ప్రభుత్వం పెంచిది. ఇప్పటివరకు రోజుకు రూ.800 చొప్పున అందుతుండగా.. దీనిని 25శాతానికి పెంచుతూ సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2019లో రూ.641గా ఉన్న మొత్తాన్ని 2022లో రూ.800కి పెంచారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో వేలాదిమంది అధ్యాపకులకు లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 05:39 AM