Share News

kumaram bheem asifabad- ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:04 PM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.మండల కేంద్రంతో పాటు బారేగూడ తదితర గ్రామాల్లో ఆదివారం ‘కాంగ్రెస్‌ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో మాత్రం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు

kumaram bheem asifabad- ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం
బెజ్జూరులో కాంగ్రెస్‌ బాకీ కార్డులు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కోనప్ప

బెజ్జూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.మండల కేంద్రంతో పాటు బారేగూడ తదితర గ్రామాల్లో ఆదివారం ‘కాంగ్రెస్‌ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో మాత్రం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2500, రైతుభరోసా, రైతుబీమా, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. హామీలు అమలయ్యే వరకు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కొంగ సత్యనారాయణ, సకరాం, అమీరొద్దీన్‌, వెంకన్న, నరేందర్‌గౌడ్‌, జావీద్‌హుస్సేన్‌, తిరుపతి, శ్రీనివాస్‌, శేఖర్‌, సాయి, ఇస్తారి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:04 PM