Share News

kumaram bheem asifabad- స్వర్ణకారులు తరలిరావాలి

ABN , Publish Date - Oct 18 , 2026 | 10:47 PM

హైదరాబాద్‌లో ఈ నెల 24న నిర్వహించనున్న స్వర్ణకార శంఖారావం కార్యక్రమానికి జిల్లా నుంచి స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌ కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆదివారం స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వృత్తి పరిరక్షణలో భాగంగా స్వర్ణకార శంఖారావం నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.

kumaram bheem asifabad- స్వర్ణకారులు తరలిరావాలి
పోస్టర్లు విడుదల చేస్తున్న స్వర్ణకార సంఘం నాయకులు

జైనూర్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఈ నెల 24న నిర్వహించనున్న స్వర్ణకార శంఖారావం కార్యక్రమానికి జిల్లా నుంచి స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌ కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆదివారం స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వృత్తి పరిరక్షణలో భాగంగా స్వర్ణకార శంఖారావం నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. నమ్ముకున్న కుల వృత్తి కనీసం తిండి పెట్టె స్థితిలో కూడా లేదన్నారు. ప్రభుత్వం 50 సంవత్సరాలు నిండిన ప్రతీ స్వర్ణకారుడికి రూ. 5000 నెలకు పెన్షన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ఆదేవిధంగా జీవో నంబరు 272ను సవరించాలని కోరారు. స్వర్ణకారులకు ప్రత్మేక కార్పొరెషన్‌ ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు కార్పొరేషనలో పాలక మండలిని నియమించాలని డిమాండ్‌ చేశారు. శంఖారావం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎతున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు మహేష్‌, ఉపాధ్యక్షులు నరేందర్‌, భూపతి, సందీప్‌, శాంతిలాల్‌, మనోజ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 10:47 PM