Share News

Gold Scam: తాకట్టు బంగారం మళ్లీ తాకట్టు

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:51 AM

తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని, మరోచోట తాకట్టుపెట్టి దాదాపు రూ.1.5 కోట్లు మోసం చేసి పారిపోయిన ఓ పాన్‌ బ్రోకర్‌ను రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Gold Scam: తాకట్టు బంగారం మళ్లీ తాకట్టు

  • రూ.1.50 కోట్లు మోసం చేసిన పాన్‌ బ్రోకర్‌

కడ్తాల్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని, మరోచోట తాకట్టుపెట్టి దాదాపు రూ.1.5 కోట్లు మోసం చేసి పారిపోయిన ఓ పాన్‌ బ్రోకర్‌ను రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. కడ్తాల్‌ పోలీ్‌సస్టేషన్‌లో బుధవారం సీఐ గంగాధర్‌ కేసు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని బ్యావర్‌ జిల్లా జైతారం మండలం రామర్‌ గ్రామానికి చెందిన బర్పానన్నారాం అలియాస్‌ నవీన్‌, అతని సోదరుడు ధర్మారామ్‌ కలిసి 2023లో కడ్తాల్‌లో గణేశ్‌ పాన్‌ బ్రోకర్స్‌ పేరుతో నగల తాకట్టు దుకాణం ఏర్పాటు చేశారు. చాలామంది ఈ దుకాణంలో బంగారు నగలు, వెండి వస్తువులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. వారికి తక్కువ మొత్తం రు ణాలు ఇచ్చిన బర్పానన్నారాం.. ఆ నగలను యజమానుల అనుమతి లేకుం డా కడ్తాల్‌లోనే ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదువపెట్టి అధిక మొత్తంలో డబ్బులు తీసుకునేవాడు. మరికొంత బంగారాన్ని సికింద్రాబాద్‌లోని ఉత్తమ్‌చంద్‌కు చెందిన వివేక్‌ పాన్‌ బ్రోకర్స్‌ వద్ద కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుతో సోదరులిద్దరూ తమ అప్పులు తీర్చారు. గత ఏడాది సెప్టెంబరులో షాపును మూసివేసి పారిపోయారు. దీంతో 25 మంది బాధితులు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 13న కందుకూరుమండలం పెద్దమ్మ తండాకు బర్పానన్నారాం వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు.. అతడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

Updated Date - Jan 15 , 2026 | 06:51 AM