Share News

గోదావరిలో గల్లంతైన విద్యార్థుల్లో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:07 AM

భద్రాచలం సమీ పంలో వేలేరు వద్ద గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతైన ఘటనలో మరో ఇద్దరి మృత దేహాలు శనివారం లభ్యమ య్యాయి.

గోదావరిలో గల్లంతైన విద్యార్థుల్లో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

భద్రాచలం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం సమీ పంలో వేలేరు వద్ద గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతైన ఘటనలో మరో ఇద్దరి మృత దేహాలు శనివారం లభ్యమ య్యాయి. గురువారం భద్రాద్రి రామయ్య దర్శనం కోసం వచ్చిన ఐదుగురు స్నేహితులు.. శుక్ర వారం భద్రాచలానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వేలేరు సమీపంలోని కొల్లు గూడెం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు నదిలో పడి ఐదు గురు గల్లంతయ్యారు. వారిలో భద్రాచలానికి చెందిన చారుగుళ్ల శ్రీకర్‌, పొడిచేటి అభిరామ్‌, కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన దగ్గుపాటి నవదీప్‌ మృతదేహాలు శుక్రవారం లభ్యం కాగా.. మిగిలిన ఇద్దరు ఏపీలోని కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెం దిన తేజ్ఞసాయి (19), చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పాశం సతీశ్‌ కుమార్‌ (19) మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. అధికారులు పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ పిల్లల మృతదేహాలను చూసి ఆ కుటుంబాల సభ్యులు తల్లడిల్లిపోయారు.

Updated Date - Mar 22 , 2026 | 05:08 AM