Share News

kumaram bheem asifabad- బాలికలు విద్యపై దృష్టి సారించాలి

ABN , Publish Date - May 07 , 2026 | 10:38 PM

బాలికలు విద్యపై దృష్టి సారించాలని డీఆర్‌డీవో దత్తారాం అన్నారు. వాంకిడి మండలం కమాన గ్రానమంలో గురువారం కిశోర బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

kumaram bheem asifabad- బాలికలు విద్యపై దృష్టి సారించాలి
అవగాహన కల్పిస్తున్న డీఆర్‌డీవో దత్తారాం

వాంకిడి, మే 7 (ఆంధ్రజ్యోతి): బాలికలు విద్యపై దృష్టి సారించాలని డీఆర్‌డీవో దత్తారాం అన్నారు. వాంకిడి మండలం కమాన గ్రానమంలో గురువారం కిశోర బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు సమాజానికి అనర్థాలను కలిగిస్తాయన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకోవడం వల్ల వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌ దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో బాలికలు చదువుపై ఎక్కువ దృస్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సైబర్‌ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అపరిచితుల మాటలను నమ్మవద్దన్నారు. బాలికల రక్షణ, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న బేటి బచావో బేటి పడావో కార్యక్రమాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎంలు రామకృష్ణ, ధనరాజ్‌, యాదగిరి, మహిళా సాధికారత అధికారులు శారద, రాణి, రేణుక, సీసీలు భీంరావు, రమేష్‌, ఆనందరావు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజంపేటలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్నేహా సమ్మర్‌ క్యాంపుల నిర్వహణలో భాగంగా యుక్త వయస్సు బాలికలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో దత్తారాం బాల్య వివాహాల నిరోధం, శారీరక దారుడ్యం, ఆటలు, సెబర్‌ భద్రత, తదితర విషయాల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీఎం యాదగిరి, ఏపీఎం ధనరాజ్‌, సీసీలు శంకర్‌, హనుమంతరావు, శ్రీదేవి, అర్చన, శారద, రాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 10:38 PM