Share News

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:06 PM

బాలికలు చదువుతో పాటు అన్ని రం గాల్లో రాణించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పే ర్కొన్నారు. శనివారం జాతీయ బాలికల దినో త్సవాన్ని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం బాలికల సంరక్షణ కో సం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌..

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 24 (ఆంధ్ర జ్యోతి) : బాలికలు చదువుతో పాటు అన్ని రం గాల్లో రాణించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పే ర్కొన్నారు. శనివారం జాతీయ బాలికల దినో త్సవాన్ని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం బాలికల సంరక్షణ కో సం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. భ్రూ ణహత్యల నివారణ, బాల్య వివాహాల నియం త్రణ చర్యల ద్వారా బాలికల ను రక్షించుకుని అణిచివేతకు గురి కాకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతుందన్నారు. బేటీ బచావో బేటే పడావో ద్వారా భ్రూణహత్యలను ని యంత్రించి ఆడ పిల్లల లింగ నిష్పత్తిని పెంచామన్నారు. పు రుషులతో సమానంగా మ హిళలు అన్ని రంగాల్లో రాణి స్తున్నారని తెలిపారు. అనం తరం జాతీయ బాలికల దినో త్సవం పోస్టర్లను విడుదల చే శారు. చదువుతో పాటు క్రీడ లు, నృత్యాలు సంస్కృతిక రంగాల్లో ప్రతిభ క నబర్చి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన బాలి కలకు జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్ర మంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, జి ల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, డీఆర్‌డీవో కి ష న్‌, డీఈవో యాదయ్య, జిల్లాషెడ్యూల్డు కుల ముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గా ప్రసాద్‌, పశు సంవర్ధక శాఖ అధికారి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 11:07 PM