బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:30 PM
బాలికలకు విద్య, భద్రత, ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించడం సమాజం లోని ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ని హారిక అన్నారు.
- డీఎల్ఎస్ఏ కార్యదర్శి నిహారిక
నాగర్కర్నూల్టౌన్, అక్టోబరు 14 (ఆంధ్ర జ్యోతి) : బాలికలకు విద్య, భద్రత, ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించడం సమాజం లోని ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ని హారిక అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం బాలికల ఆశ్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్ ఎస్ఏ కార్యదర్శి నిహారిక మాట్లాడుతూ స మాజంలో లింగ వివక్ష, బాల్య వివాహాలు, అ సమానతలను రూపు మాపేందుకు ప్రతీ ఒ క్కరు కృషి చేయాలని సూచించారు. ప్రతీ బా లికకు నాణ్యమైన విద్య అందించాలని, ఆర్ధిక, ఇతర కారణాలతో బాలికలు చదువు మధ్య లోనే చదువు మానేయకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. విద్యార్ధి దవ ఎంతో కీలకమని, కష్టపడి చదివి తమ లక్ష్యా లను సాధించేలా ముందుకు సాగాలని బాలి కలకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ రామ్ ఆర్య, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.