Share News

బాలికలు సృజనాత్మకంగా రాణించాలి

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:30 PM

నేటి స మాజంలో బాలికలు చదువుతో పాటు సృజనాత్మక ఆలోచనల తో రాణించాలని జిల్లా విద్యాశా ఖాధికారి రమేష్‌కుమార్‌ అన్నా రు.

బాలికలు సృజనాత్మకంగా రాణించాలి
డీఈవో రమేశ్‌కుమార్‌ను సన్మానిస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయినులు

- జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఫిబ్ర వరి 12 (ఆంధ్రజ్యోతి): నేటి స మాజంలో బాలికలు చదువుతో పాటు సృజనాత్మక ఆలోచనల తో రాణించాలని జిల్లా విద్యాశా ఖాధికారి రమేష్‌కుమార్‌ అన్నా రు. గురువారం నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీ పరిధిలోని నాగ నూలు కేజీబీవీలో పదో తరగతి విద్యార్థుల ఫేర్‌వెల్‌ పార్టీ కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఈవో మాట్లాడుతూ రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షలు కేజీబీవీ విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సా ధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీఈవో ఆకాంక్షిం చారు. అనంతరం డీఈవోను పాఠశాల ఉపా ధ్యాయినుల బృందం శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ ఎంఈవో భాస్కర్‌ రెడ్డి, జిల్లా టెక్ట్స్‌ బుక్స్‌ మేనేజరు నరసింహులు, కేజీబీవీల ప్రత్యేక అధికారి, ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:30 PM