kumaram bheem asifabad- పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా
ABN , Publish Date - Apr 29 , 2026 | 10:53 PM
పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలో మొత్తం 6,932 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,213 మంది బాలురు, 3,719 మంది బాలికలు పరీక్షలు రాశారు. ఇందులో 2,949 మంది బాలురు, 3,578 మంది బాలికలు మొత్తం 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 91.78 శాతం, బాలికలు 96.21 శాతం మొత్తం 94.16 శాతం ఉత్తీర్ణత సాధించారు.
- రాష్ట్రంలో జిల్లాకు 28వ స్థానం
ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలో మొత్తం 6,932 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,213 మంది బాలురు, 3,719 మంది బాలికలు పరీక్షలు రాశారు. ఇందులో 2,949 మంది బాలురు, 3,578 మంది బాలికలు మొత్తం 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 91.78 శాతం, బాలికలు 96.21 శాతం మొత్తం 94.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా 28వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్తంత మెరుగైన ఫలితాలే సాధించారు. గతేడాది పది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 32 స్థానంలో నిలువగా ఈ ఏడాది 28వ స్థానానికి చేరుకుంది. జిల్లాలో 54 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 12 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, మూడు బీసీ సంక్షేమ గురుకులాలు, ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఏడు కేజీబీవీలు, ఒక మైనార్టీ ఉన్నత పాఠశాల, రెండు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మూడు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, 18 ప్రైవేటు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో అత్యధికంగా కెరమెరి మండలం 99.11 శాతం ఉత్తీర్ణత సాధించగా అత్యల్పంగా సిర్పూర్(టి) మండలంలో 92.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. సిర్పూర్(టి) గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశా లకు చెందిన భుక్యా అక్షయ 587/600 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు.
ఆసిఫాబాద్‌రూరల్: పదోరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆసిఫాబాద్ మండలంలో మొత్తం 1,189 మంది పరీక్షలకు హజరు కాగా ఇందులో 620 మంది బాలురు, 569 మంది బాలికలు పరీక్షలు రాశారు. ఇందులో 574 మంది బాలురు, 549 మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా ఇందులో బాలురు 92.58 శాతం, 96.49 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఆసిఫాబాద్ మండలంలో మొత్తం 94.45 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. ఆసిఫాబాద్ మండలంలోని మహత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలకు చెంది కె స్వాతికా 562/600, ఎస్ కీర్తన 561/600, ఎ లక్ష్మి 557/600, పట్టణంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన దుర్గం దివ్య 549/600, సాంగ్డె మీనాక్షి 548/600, ముత్యాల రిషీత 547/600 మార్కులు సాధించారు.
కాగజ్‌నగర్,(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మండలంలో పది పరీక్షలో 87 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు ఎంఈవో వాసాల ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 573 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఇందులో 499 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రాస్పెల్లిలో కార్తీక్ 541 టాపర్‌గా, ప్రభుత్వ హైస్కూల్ కాగజ్‌నగర్‌లో శ్రీజ, కెజీబీవీలో 525 మార్కులతో ద్వితీయా స్థానంలో వచ్చినట్టు తెలిపారు. పెట్రోల్ బంక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైష్ణవి 522 మార్కులతో తృతీయా టాపర్‌గా నిలిచినట్లు ఎంఈవో తెలిపారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేంద్రంలోని కేజీబీవీలో పదో తరగతిలో వంద శాతం మంది విద్యార్థుఽలు ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలలో 39 మందికి గాను 39 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 94 మందికి 93 మంది, వాంకిడి ఉన్నత పాఠశాలలో 160 మందికి 153 మంది, ఇందాని ఉన్నఏత పాఠశాలలో 28 మందికి 25 మంది, కిరిడి ఉన్నత పాఠశాలలో 23 మందికి 21 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందాని పాఠశాలకు చెందిన విద్యార్థి బిశ్వాక దేవిక 560 మార్కులు, ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని శ్రావణి 540, కేజీబీవీకి చెందిన విద్యార్థిని జయ 535, గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన మిశ్రంహిర 521 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలో 98.8 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని గోయగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 28 మందికి 28 మంది, కెరమెరిలో 77 మందికి గాను 76 మంది, మోడి ఆశ్రమ పాఠశాలలో 83 మందికి 82 మంది, మోడి కేజీబీవీలో 41 మందికి 41 మంది, హట్టి ఆశ్రమ పాఠశాలలో 52 మందికి 51 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే అనార్‌పల్లి ఆశ్రమ పాఠశాలలో 14 మందికి 14 మంది, రాంజిగూడ ఆశ్రమ పాఠశాలలో 8 మందికి 8 మంది, ఝరి ఉర్దు మీడియంలో 31 మందకి 30 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధంచగా మండల వ్యాప్తంగా 338 మందికి గాను 334 మంది ఉత్తీర్ణత సాధించారు. మండల టాపర్‌గా కేజీబీవీ విద్యార్థిని మీనాక్షి 542 మార్కులు సాధించింది.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి):మండలంలోని ఆరు పాఠశాలల్లో 97 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మహగాం ఆశ్రమ పాఠశాల నుంచి 43 మంది, కోహినూర్ ఆశ్రమ పాఠశాల నుంచి 45 మంది, మండల కేంద్రంలోని కేజీబీవీ నుంచి 37 మంది పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణిత సాధించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల సిబ్బందిని, విద్యార్థులను మండల ప్రజలు ప్రజప్రతినిధులతోపాటు మండల విద్యాదికారి కుడ్మేత సుధాకర్ అభినందించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థి ఆభిషేక్ 541 మార్కులు సాదించి మండల టాపర్ నిలిచాడు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలో 281 మంది విద్యార్థులకు గాను 269 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 95.73 శాతంగా నమోదు చేశారు. ఇట్యాల, బీబ్రా, సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో 100 శాతం నమోదు అయింది. మండల టాపర్‌గా సెయింట్ ఫ్రాన్సిప్ పాఠశాలకు చెందిన విద్యార్థిని మానెం ధనలక్ష్మి 539 మార్కులు సాధించింది. ఇట్యాల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన దాగిల అంజన్న 533 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ధనూరి మౌనిక 515, కేజీబీవీ విద్యార్థిని ఆత్రం అంజలి 515 మార్కులు సాధించారు. విద్యార్థులను ఎంఈవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి):మండలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సోమిని, సలుగుపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 100 శాతం, కేజీబీవీలో 46 మందికి 46 మంది, బెజ్జూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 82 మందికి 73 మంది, సలుగుపల్లి జిల్లా పరిషత్‌లో 39 మందికి 34 మంది, పాపన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 21 మందికి 19 మంది, ఉత్తీర్ణత సాధించారు. సలుగుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన పవన్ కళ్యాణ్(517/600) మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. అలాగే బెజ్జూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన కొండపల్లి అస్మిత(507/600) మార్కులు సాధించింది.