‘పది’ ఫలితాల్లో బాలికలదే హవా..
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:33 AM
పదో తరగతి ఫరీక్ష ఫలితాల్లో బాలికలదే మళ్లీ హవా కొనసాగింది. బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు విడుదల చేసి పది ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో తన స్థానాన్ని గతలోకంటే భారీగా తగ్గించుకుంది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 5వ స్థానంలో
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పదో తరగతి ఫరీక్ష ఫలితాల్లో బాలికలదే మళ్లీ హవా కొనసాగింది. బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు విడుదల చేసి పది ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో తన స్థానాన్ని గతలోకంటే భారీగా తగ్గించుకుంది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి 97.74 శాతం ఉత్తీర్ణతతో 15వ స్థానంతో సరిపెట్టుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3వ స్థానంలో నిలిచింది. ఈసారి వాట్సాప్‌లో పదో తరగతిలో సబ్జెక్ట్‌ల వారీగా మార్కులు, గ్రేడ్‌లు, మెమోలను కూడా అందించారు. ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్ట్‌లను క్లియర్ చేయని విద్యార్థుల కోసం జూన్‌లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 5 నుంచి 12 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా పరీక్ష రుసుము చెల్లించాలని సూచిస్తున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాలో 7145 మంది విద్యార్థులు పాస్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7310మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకాగా, 7145మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3525మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 3411 మంది ఉత్తీర్ణులయ్యారు. 3785మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 3734 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 97.74 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 96.77శాతం, బాలికలు 98.65 శాతం ఉత్తీర్ణులయ్యారు.
బాలికలే ముందంజ..
జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారిలో మరోసారి బాలికలే ముందంజలో నిలిచారు. బాలురు 3411మంది, బాలికలు 3734 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 323 మంది ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు.
176 మంది ఫెయిల్...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సంవత్సరం పది ఫలితాల్లో 176 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. బాలురు 3,525 మంది పరీక్షలకు హాజరుకాగా 84 మంది ఫెయిల్ అయ్యారు. బాలికలు 3785 మంది పరీక్షలకు హాజరు కాగా 51 మంది ఫెయిల్ అయ్యారు.
మేనేజ్మెంట్ వారీగా ఉత్తీర్ణత..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయి మార్కులతో ముందంజలో నిలిచారు. జిల్లాలో 197 పాఠశాలల్లో 97.74 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బీసీ వెల్ఫేర్, టీజీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 100 శాతం, టీడబ్ల్యూఆర్‌లో 99.19శాతం, కేజీబీవీ పాఠశాలలో 99.11 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలో 96.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.
మేనేజ్మెంట్ పాఠశాలలు హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత బాలురు బాలికలు శాతం
ప్రైవేట్ 54 1,756 1,741 1020 721 99.15
మోడల్ స్కూల్ 7 535 522 276 246 97.57
ఎస్‌డబ్ల్యూఆర్ 7 504 501 139 362 99.4
జిల్లా పరిషత్ 104 3,256 3,138 1,711 1,427 96.38
కేజీబీవీ 13 563 558 0 558 99.11
టీజీ రెసిడెన్షియల్ 1 78 78 0 78 100
టీడబ్ల్యూఆర్ 2 123 122 0 122 99.19
ప్రభుత్వ 2 138 130 79 51 94.2
బీసీ వెల్ఫేర్ 5 287 287 156 131 100
మైనార్టీ రెసిడెన్షియల్ 2 70 68 30 38 97.14
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 197 7,310 7,145 3,411 3,734 97.74
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సంవత్సరాల వారీగా
విద్యాసంవత్సరం ఉత్తీర్ణత శాతం
2016 - 2017 87.3
2017 - 2018 91.3
2018 - 2019 97.7
2019 - 2020 100
2020 - 2021 100
2021 - 2022 95.76
2022 - 2023 94.37
2023 - 2024 98.27
2024- 2025 98.15
2025- 2026 97.74