Share News

kumaram bheem asifabad- ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:28 PM

ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాలలో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకొగ, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో తొమ్మిదో స్థానం దక్కింది. జిల్లాలో ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 1,595 మంది బాలురు, 2,150 మంది బాలికలు మొత్తం 3745 మంది విద్యార్థులు పరీక్షలు హజరు కాగా ఇందులో 1165 మంది బాలురు, 1,952 మంది బాలికలు మొత్తం 3077 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

kumaram bheem asifabad- ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా
లోగో

- మొదటి సంవత్సరంలో తొమ్మిదో స్థానం

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాలలో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకొగ, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో తొమ్మిదో స్థానం దక్కింది. జిల్లాలో ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 1,595 మంది బాలురు, 2,150 మంది బాలికలు మొత్తం 3745 మంది విద్యార్థులు పరీక్షలు హజరు కాగా ఇందులో 1165 మంది బాలురు, 1,952 మంది బాలికలు మొత్తం 3077 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 82.16 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. ఒకేషనల్‌ విభాగంలో 311 మంది బాలురు, 319 మంది బాలికలు మొత్తం 654 మంది పరీక్షలు రాయగా ఇందులో 257 మంది బాలురు, 319 మంది బాలికలు మొత్తం 576 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 88.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 1990 మంది బాలురు, 2302 మంది బాలికలు మొత్తం 4292 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా ఇందులో 1049 మంది బాలురు, 1813 మంది బాలికలు మొత్తం 2862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 66.68 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. అలాగే ఒకేషనల్‌ విభాగంలో 345 మంది బాలురు, 409 మంది బాలికలు మొత్తం 754 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా ఇందులో 198 మంది బాలురు, 326 మంది బాలికలు మొత్తం 524 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 69.50 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానాన్ని సాధించి సత్తా చాటారు. కాగా ప్రథమ, ద్వితీయ జనరల్‌, ఒకేషనల్‌ విభాగాలలో మొత్తం 2669 మంది బాలురు, 4410 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి బాలికలదే పైచేయిగా నిలిచారు. ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలకు చెందిన సామాల వేదాక్షర ఎంపీసీలో 960/1000, బైపీసీలో అల్లే వైష్ణవీ 973/1000, సీఈసీలో మాధురీ బీశ్వాష్‌ 955/1000, ఎంఈసీలో వైష్ణవీ 883/1000, వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన బి మంగళ బైపీసీలో 954/ 1000, మండలంలోని బాబాపూర్‌ మహత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన సిహెచ్‌ కావేరి బైపీసీలో 971/1000, ఎం ఆశ్విత ఎంపీసీలో 960/1000 మార్కులు సాధించారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో బెజ్జూరు కస్తూర్బా, జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 92మంది విద్యార్థులు పరీక్ష రాయగా 62మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 92మందికి గాను 77మంది ఉత్తీర్ణత సాధించారు. కళాశాల టాపర్‌గా గుర్లె పవన్‌ (బైపీసీ ద్వితీయ సంవత్స రం)909/1000, సౌజన్య(బైపీసీ ద్వితీయ సంవత్సరం) 847/1000మార్కులు సాధించి ప్రతిభ చాటారు. కస్తూర్బా పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 57మందికి గాను 54మంది, ద్వితీయ సంవత్సరంలో 44 మంది విద్యార్థులకు గాను 44మంది ఉత్తీర్ణత సాధించి 100శాతం ఫలితాలు సాధిం చారు. కస్తూర్బా పాఠశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీహెచ్‌డబ్ల్యూలో స్వరూప 946/1000 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 179 మంది పరీక్షలు రాయగా 103 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో 143 పరీక్షలకు హాజరు కాగా 126 మంది ఉత్తీర్ణులైనట్లు ప్రిన్పిపాల్‌ చంద్రయ్య తెలిపారు. ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌లో బైపీసీలో జే. వాణి 404 మార్కులు, సీఈసీలో దేవిదాస్‌ 332 మార్కులు, ఎంపీసీలో ఎస్‌. ప్రణయ్‌ 383 మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ లో బి. మంగళ బైపీసీ 954, నీలేష్‌ ఎంపీసీలో 916 మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నలిచినట్లు ప్రిన్సిపాల్‌ చంద్రయ్య తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 11:28 PM