Share News

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్‌

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:41 AM

శ్రీనగర్‌ కాలనీలో ఉన్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. అస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ...

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్‌

  • ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడమే కారణం

బంజారాహిల్స్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): శ్రీనగర్‌ కాలనీలో ఉన్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. అస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ిఫిబ్రవరిలో జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో జీ+4 భవనాన్ని సీజ్‌ చేశారు. ఇంటికి సంబంధించి సుమారు రూ.83 లక్షల ఆస్తి పన్ను పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 05:41 AM