Share News

kumaram bheem asifabad- యాప్‌తో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం సులువు

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:01 PM

డైవింగ్‌ లైసెన్స్‌ పొందడం ఇక సులవైంది. లైసెన్స్‌ ఫీజు కట్టి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తే డ్రైవింగ్‌ పరీక్షకు ముందు నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష(ఎల్‌ఎల్‌ఆర్‌- లెర్నర్స్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌) గట్టెక్కుతామో లేదోననే సందేహం వ్యక్తమవుతోంది. ముందుగానే పరీక్షకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దీంతో పరీక్షకు హాజరైతే సులభతరమవుతంది. ఈ మేరకు ఆర్టీవో ఎగ్జాం యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకు మోబైల్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆర్టీవో ఎగ్జామ్‌ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ను తెరవగానే క్వశ్చన్‌ బ్యాంకు, ప్రాక్టిస్‌ ఎగ్జామ్‌, సెట్టింగ్స్‌ హెల్ప్‌ ఆప్షన్లు తెరపై కన్పిస్తాయి

kumaram bheem asifabad- యాప్‌తో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం సులువు
లోగో

రెబ్బెన, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): డైవింగ్‌ లైసెన్స్‌ పొందడం ఇక సులవైంది. లైసెన్స్‌ ఫీజు కట్టి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తే డ్రైవింగ్‌ పరీక్షకు ముందు నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష(ఎల్‌ఎల్‌ఆర్‌- లెర్నర్స్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌) గట్టెక్కుతామో లేదోననే సందేహం వ్యక్తమవుతోంది. ముందుగానే పరీక్షకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దీంతో పరీక్షకు హాజరైతే సులభతరమవుతంది. ఈ మేరకు ఆర్టీవో ఎగ్జాం యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకు మోబైల్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆర్టీవో ఎగ్జామ్‌ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ను తెరవగానే క్వశ్చన్‌ బ్యాంకు, ప్రాక్టిస్‌ ఎగ్జామ్‌, సెట్టింగ్స్‌ హెల్ప్‌ ఆప్షన్లు తెరపై కన్పిస్తాయి. క్వశ్చన్‌ బ్యాంకు ఎంచుకోగానే 318 ప్రశ్నలు, సమాధానాలు కన్పిస్తాయి. పక్కనే ట్రాఫిక్‌ సైన్స్‌ కాలం ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేస్తే సైన్స్‌(సూచికలు), వాటిని ఏమని పిలుస్తారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ప్రాక్టిస్‌లోకి వెళ్తే ఒక్క ప్రశ్న నాలుగు సమాధానాలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు సమాధానం క్లిక్‌ చేస్తూ వెళ్లుతుంటే మరో ప్రశ్న కన్పిస్తోంది. అనంతరం ఎగ్జాం ఎంచుకుంటే నాలుగు సమాధానాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు సమాధానం ఎంపిక చేస్తే అది సరైనదా, కాదా అని చెబుతుంది. ప్రతి ప్రశ్నకు 30 సెకన్ల సమయం ఉంటుంది. పదినిమిషాలు ముగియగానే పాసయ్యారో లేదో తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చే ప్రశ్నలకు సమాతంరమైనవే ఆర్టీఏ కార్యాలయంలో పరీక్ష సందర్భంగా అడిగే అవకాశం ఉంది. అక్కడ తడబడకుండా పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి లెర్నింగ్‌ లైసెన్స్‌ పొందే అవకాశం ఉంటుంది. వాహనదారులకు అవసరమైన డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందుగా జారీ చేసే ఎల్‌ఎల్‌ఆర్‌ పొందడం అనేక మందికి సవాల్‌గా నిలుస్తోంది. 50 శాతం మంది పరీక్షలో నెగ్గలేక పోతున్నారు. పది నిమిషాల వ్యవధిలో నిర్వహించే పరీక్ష సందర్భంగా 20 ప్రశ్నల్లో కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే పాస్‌ అయినట్లు లెక్క. లేదంటే కాలయాపనతో పాటు మరో సారి ఆర్టీవో కార్యాలయం చుట్టు తిరుగాల్సి వస్తోంది.

Updated Date - Jun 08 , 2026 | 11:01 PM