లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:22 PM
గర్భవతులకు స్కానింగ్ చేసి లిం గనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కే.కృష్ణ అన్నారు.
- డీఎంహెచ్‌వో డాక్టర్ కే కృష్ణ
కందనూలు, జూలై 22 (ఆంధ్రజ్యో తి) : గర్భవతులకు స్కానింగ్ చేసి లిం గనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కే.కృష్ణ అన్నారు. నాగర్‌కర్నూల్‌లోని ప్రై వేట్ స్కానింగ్ సెంటర్లను ఆయన ఆక స్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ సెం టర్‌లో గర్భవతుల రికార్డులను, ఫారం ఎఫ్‌లను పరిశీలించారు. గర్భస్థశిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, చేయిం చుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసు కుంటామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధి కారి డాక్టర్ కే.రవికుమార్, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి, డీపీవో రేణయ్య, ఏపీవోలు పాల్గొన్నారు.
ప్రతీ చిన్నారికి అన్ని టీకాలు వేయాలి
తెలకపల్లి, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : పుట్టిన ప్రతీ శిశువుకు 12 ప్రాణాంతక వ్యాధులు రా కుండా అన్ని టీకాలను సరైన సమయంలో వేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.కృష్ణ తెలిపారు. బుధవారం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిన్న ము ద్దునూరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను పరిశీ లించారు. పుట్టిన శిశువులకు అన్ని టీకాలను స కాలంలో చేయాలని తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఫీవర్ సర్వేను క్రమం తప్పకుండా చేయాలని, గర్భిణులు పరీక్షల కోసం 102 వాహన సేవల ను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అతావుల్లాఖాన్, జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి, డీపీవో రేణయ్య, ఎంఎల్ హెచ్ పీ, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.