సేఫ్టీ కిట్‌లపై గీత కార్మికులకు అవగాహన
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:07 PM
తెలంగా ణ ప్రభుత్వం బీసీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ప్రొ హిబిషన్ అండ్ ఎక్సైజ్ క ల్వకుర్తిసర్కిల్ పరిధిలోని చారకొండ మండల కేం ద్రంలోని తాటివనంలో మంగళ వారం ఎక్సైజ్‌శాఖ సీఐ వెంకట్‌రెడ్డి అధ్యక్ష త న మండలంలోని గోకారం, తుర్కలపల్లి గ్రామాలతో పాటు తాడూర్ మండలం లోని సిర్సవాడకు చెందిన 66 మంది గీత కార్మి కులకు కాటమయ్య సేఫ్టీ కిట్‌లపై శిక్షణ, అవ గాహన కార్యక్రమం నిర్వహించారు.
చారకొండ, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగా ణ ప్రభుత్వం బీసీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ప్రొ హిబిషన్ అండ్ ఎక్సైజ్ క ల్వకుర్తిసర్కిల్ పరిధిలోని చారకొండ మండల కేం ద్రంలోని తాటివనంలో మంగళ వారం ఎక్సైజ్‌శాఖ సీఐ వెంకట్‌రెడ్డి అధ్యక్ష త న మండలంలోని గోకారం, తుర్కలపల్లి గ్రామాలతో పాటు తాడూర్ మండలం లోని సిర్సవాడకు చెందిన 66 మంది గీత కార్మి కులకు కాటమయ్య సేఫ్టీ కిట్‌లపై శిక్షణ, అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారి వి.వేణుగో పాల్‌రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్ర భుత్వం గీత కార్మికులు వృత్తి నిర్వహణలో భా గంగా తాటి చెట్టు ఎక్కేటప్పుడు ఎదురయ్యే ప్ర మాదాల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాట మయ్య రక్షా కవచం కిట్‌ల పంపిణీ కోసం మా స్టర్ ట్రైనర్‌ల బృందంచే గీత కార్మికులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలి పారు. గీత కార్మికులకు ఈ కిట్‌లను గీత మో కులకు అదనంగా కొన్ని సురక్షా పరికరాలు అ మర్చుకోవడం ద్వారా తాటి చెట్టుపై నుంచి జా రిపడే ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి ఇందిర, తుర్కలపల్లి సర్పంచ్ సహదేవ్, మాజీ జడ్పీటీసీ గుండె వెంకట్‌గౌడ్, జిల్లా ఎక్సైజ్‌శాఖ సీఐ కళ్యాణ్, లక్ష్మీనారాయణ, మాస్టర్ ట్రైనర్‌లు ప్రశాంత్, నాగేశ్వర్‌రావు, సిబ్బంది మునీందర్, జనార్ధన్‌రెడ్డి, సిద్దర్థ, చంద్రశేఖర్, గీతకార్మికులు తదితరులు పాల్గొన్నారు.