kumaram bheem asifabad- రీ సర్వేకు సన్నద్ధం
ABN , Publish Date - Jul 26 , 2026 | 10:09 PM
నిజాం కాలంనాటి సర్వేలతో నెలకొన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం భూ రీ సర్వే కార్యక్రమాన్ని చేపడుతోం ది. జిల్లాలోని 15మండలాల్లో ఎంపిక చేసిన 70గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు. సర్వేలో భూముల హద్దులను శాస్ర్తీయంగా నిర్దారించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రికార్డులను నవీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రీసర్వేను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.
- సర్వే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
- ఆధునిక పరికరాలతో కొలతలు
- జిల్లాలో 70గ్రామాలకు నోటిఫికేషన్
బెజ్జూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): నిజాం కాలంనాటి సర్వేలతో నెలకొన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం భూ రీ సర్వే కార్యక్రమాన్ని చేపడుతోం ది. జిల్లాలోని 15మండలాల్లో ఎంపిక చేసిన 70గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు. సర్వేలో భూముల హద్దులను శాస్ర్తీయంగా నిర్దారించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రికార్డులను నవీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రీసర్వేను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ ప్రక్రియలో ఇప్పటికే జిల్లాలోని రెవెన్యూ, సర్వే విభాగానికి చెందిన అధికారులతో పాటు మండల సర్వేయర్లు, వారితో పాటు జీపీవోలు, జూనియర్ అసిస్టెంట్లను రీ సర్వేకు వినియోగించనున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలోని 15మండలాలకు 15మంది సర్వేయర్ల తో పాటు మరో 15మంది గ్రామపరిపాలన అధికా రులు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు వినియోగిం చనున్నారు. రీ సర్వేలో రెవెన్యూ రికార్డులపై అవగాహన కలిగిన గ్రామపాలనాధికారులు ఆయా భూ కమతాలకు చెందిన రికార్డులు, తహసీల్దార్ నిర్ధారించిన పహాణీలతో సర్వేయర్లకు సహకరిస్తా రు. అదే విధంగా ఆయా గ్రామాలకు చెందిన భూ కమతాల యజమానులకు నోటీసులు జారీ చేయడం, రీ సర్వేపై అవగాహన కల్పించడం వం టి విధులు నిర్వహిస్తారు. వీరికి జిల్లా కేంద్రంలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వేపై ఈ నెల 23వ తేదీ వరకు అవగాహన కల్పిస్తారు. అనంతరం రీ సర్వే కోసం రంగంలోకి దిగుతారు. పర్వేకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియో గించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 10అత్యాధునిక డిజిటల్ సర్వే పరికరాలు రోబోటిక్ బోటల్ స్టేషన్(రోబర్స్) అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలోని సర్వే రికార్డులు సక్రమంగా లేని మరో 37గ్రామాలను కూడా ఎంపిక చేశారు.
- హద్దు రాళ్ల గుర్తింపు..
రీ సర్వేకు ఎంపిక చేసిన గ్రామాల్లో తొలుత ఆ గ్రామ సరిహద్దులు, రెవెన్యూ పరిధి, సర్వే నంబర్ల హద్దు రాళ్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు సరిహద్దుల్లో ఉన్న రైతుల నుంచి సైతం అంగీకార పత్రాలు తీసుకొని గ్రామ సరిహ ద్దులను గుర్తిస్తున్నారు. గ్రామ సరిహద్దుల నిర్ధార ణ తర్వాత ప్రభుత్వ భూములు, గ్రామ కంఠకం హద్దులను నిర్ణయిస్తారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం రైతుల భూ కమతాలను రీ సర్వే చేసి రైతుల సమక్షంలోనే ల్యాండ్ పార్శిల్ సర్వేలను నిర్వహిస్తారు. అయితే సరిహద్దు రైతులు పేచీ పెడితే మాత్రం ఆ భూకమతం వివాదం పెండింగ్‌లో ఉంటుంది.
- భూ కమతాలకు..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వేతో భూ కమతాలకు కచ్చితమైన హద్దులను నిర్ధారించ నున్నారు. రైతుల అనుభవంలోని భూ సరిహ ద్దులు, విస్తీర్ణం, యజమాని వివరాలు, జియో కో ఆర్డినేట్లు డిజిటల్ రూపంలో ల్యాండ్ పార్శిల్ మ్యాప్‌ను రూపొందిస్తారు. ప్రతీ కమతానికి ప్రత్యేక గుర్తింపు నంబరు(యూనిక్ పార్శిల్ ఐడీ)జారీ చేస్తారు. రీ సర్వేలో తొలుత పాత రెవెన్యూ రికా ర్డులు, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్, రిజిస్ర్టేషన్ పత్రా లను పరిశీలిస్తారు. భూమికి డిఫరెన్షియల్ జీపీఎస్ ద్వారా కచ్చితమైన నియంత్రణ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఆధునిక రోబర్స్ సాయంతో కొలతలను సేకరిస్తారు. అయితే భూముల హద్దులను పొరుగు రైతుల సమక్షంలోనే గుర్తించి నమోదు చేసి, డిజిటల్ ల్యాండ్ పార్శిల్ మ్యాప్‌ను రూపొం దిస్తారు. మొదట ముసాయిదా మ్యాప్‌ను గ్రామాల్లో ప్రదర్శించి, అభ్యంతరాలను స్వీకరించి, విచారణ అనంతరమే తుది ల్యాండ్ పార్శిల్ మ్యాప్‌ను ఆమోదించి రికార్డుల్లో నమోదు చేస్తారు.
- వివాదాల కారణంగా..
ప్రతీ గ్రామంలో భూ వివాదాల కారణంగా న్యా య వివాదాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తు తున్నాయి. ఇటువంటి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రీ సర్వేను ప్రభుత్వం చేపట్టిం ది. ప్రతీ భూ కమతానికి కచ్చితమైన సరిహద్దు నిర్ధారణ, విస్తీర్ణం నమోదు, డిజిటల్ రికార్డులు అందుబాటులోకి రావడమే కాకుండా రిజిస్ర్టేషన్, మ్యుటేషన్, రుణాల వంటివి పొందడం సులభతర మవుతుంది. వీటితో పాటు భూ ఆక్రమణలను, నకిలీ రికార్డులను గుర్తించడం ద్వారా నిజమైన భూ యజమానులకు న్యా యం జరుగుతుంది. ఈ రీ సర్వే ద్వారా భూ తగాదాలకు ఆస్కారం లేకుం డా ఉంటుంది.
సర్వే బృందాలకు సహకరించాలి..
- వినయ్‌కుమార్, జిల్లా సర్వే అధికారి
భూముల యజమానులు సర్వే బృందాలకు సహకరించాలి. జిల్లాలోని భూ రీసర్వేకు 15మం డలాల్లో 70గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం ప్రభు త్వం రీసర్వే చేపడుతోంది. దీనికి సంబం ధించి ప్రతీ భూమి సొంతదారులు, రిజిస్ర్టేషన్ దారులు నిర్ధేశించిన గ్రామాల్లో హాజరై సర్వే బృందాలకు సహకరించాలి. భూమి సరిహద్దులను గుర్తించడానికి, ఇతర సమాచారం అందించేందుకు అధికారుల సూచనలు పాటించాలి.