kumaram bheem asifabad- గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:34 PM
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ ఏర్పడింది. పదిరోజుల నుంచి యుద్ధం జరుగుతుండడంతో గ్యాస్ సరఫరా చేసే విషయమై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విఽధిస్తూ వస్తున్నది. కొరతను అధిగమించేందుకు ఇష్టారాజ్యంగా గ్యాస్‌బుకింగ్ చేసుకోకుండా ఉండేందుకు సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య బుకింగ్ వ్యవధిని పెంచుతూ వస్తున్నది.
వాంకిడి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ ఏర్పడింది. పదిరోజుల నుంచి యుద్ధం జరుగుతుండడంతో గ్యాస్ సరఫరా చేసే విషయమై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విఽధిస్తూ వస్తున్నది. కొరతను అధిగమించేందుకు ఇష్టారాజ్యంగా గ్యాస్‌బుకింగ్ చేసుకోకుండా ఉండేందుకు సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య బుకింగ్ వ్యవధిని పెంచుతూ వస్తున్నది. దీంతో పలువు రు వంట గ్యాస్‌కు బదులు ప్రత్యామ్నయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో వంట గ్యాస్‌కు బదులు ఎలక్ర్టికల్‌కు సంబంధించి ఎన్నో రకాల స్టౌవ్‌లు ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేందుకు సెర్చ్ చేస్తున్నారు. మరికొందరు నేరుగా షాప్‌ల వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకుంటున్నారు.
- ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ..
గ్యాస్ కొరత, ధరలు పెరగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారికి ఎటక్ట్రికల్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ స్టౌవ్‌లు, ఇండక్షన్ స్టవ్, ఎంప్రేయర్లు, మైక్రోవెవ్ ఓవెన్లు వంటివి అవకాశాలుగా మారుతున్నాయి. టీ, కాఫీ, పాలు కాచుకోవడానికి కెటిల్స్, టిఫిన్స్, స్నాక్స్ కోసం టోస్ట్ మేకర్స్ వంటివి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్‌కు ప్రత్యామ్నాయం ఇండక్షన్ స్టవ్‌లు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు గృహిణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సాంప్రదాయ ఇండక్షన్ స్టవ్‌లకు బదులుగా ఎన్‌ఫ్రారెడ్ ఇండక్షన్ స్టవ్‌లు వచ్చాయని, వంట పాత్రలతో వంటకాలను చేసుకునే అవకాశాన్ని ఇవి అందిస్తున్నాయని చెబుతున్నారు.
- ఇటీవల కాలంలో..
ఇటీవల కాలంలో మన దేశంలోనూ ఇండక్షన్ స్టవ్‌లు వాడకంలోకి వస్తున్నాయి. విద్యుత్‌కు సంబంధించినవి అయినప్పటికీ సురక్షితమైనవని, వంట కోసం గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచే ఇకే ఒకమార్గం ఇండక్షన్ స్టవ్‌అని అంటున్నారు. ఎలక్ట్రికల్ కుక్కర్లు ఉన్నప్పటికి వాటి పనితీరు పరిమితంగా ఉంటుంది. కానీ ఇండక్షన్ స్టవ్‌లకు ఇండక్షన్ బేస్ పాత్రలు అవసరం. ఇటీవల కాలంలో వంట పాత్రలన్నీ దాదాపు ఇండక్షన్ బేస్‌తోనే వస్తున్నాయి. కాబట్టి దాదాపు 9 0శాతం వంటలు వీటితో పూర్తి చేయవచ్చని పలువురు ఎలకా్ట్రనిక్ షోరూమ్ నిర్వాహకులు వివరిస్తున్నారు. గ్యాస్ స్టవ్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ వంటల్లో పొగ రావడం అనేది సమస్య పెద్దగా ఉండదని చెబుతున్నారు.
- తక్కువ ఖర్చుతోనే..
ఇండక్షన్ స్టవ్‌లతో అయ్యే ఖర్చు తక్కువగానే ఉంటుం దని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్లో 1,800 నుంచి 2000 వాట్ల ఇండక్షన్ స్టవ్‌లు లభిస్తుంటాయి. వీటి ధర 1,400 నుంచి మొదలవు తున్నాయి. అదే ఇన్‌ఫ్రారెడ్ ఇండక్షన్ స్టవ్‌ల బ్రాండ్‌ను బట్టి రూ. 3,500 నుంచి ప్రారంభమవుతాయి. వీటితో కరెంటు కూడా పెద్దగా వినియోగం కాదంటున్నారు నిపుణులు. వీటిని గంట పాటు వాడితే రెండు యూ నిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యుత్ 100 యూనిట్ల వరకు రూ. 3.10 పైసలు, 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ. 4.80 సైసలు, 200 యూని ట్లకు పైగా దాటితే రూ. 5.10 అవుతుంది. గ్యాస్ ఖర్చు రూ. 965తో పోలిస్తే తక్కువేనని చెబుతున్నారు.