Share News

గ్యాస్‌ మంట....

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:45 PM

ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధ ప్రభావం ప్రజలపై పెను భారం మోపుతోంది. కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కార ణంగా చమురు సరఫరా మందగించడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

గ్యాస్‌ మంట....

-యుద్ధ ప్రభావంతో ప్రజలపై అదనపు భారం

-చమురు ధరలు పెరగడంతో రేట్ల పెంపు అనివార్యం

-వంట గ్యాస్‌పై రూ. 60, కమర్షియల్‌పై రూ. 115 వడ్డన

-పెట్రోల్‌, డీజిల్‌ ధరలపైనా ప్రభావం..?

మంచిర్యాల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధ ప్రభావం ప్రజలపై పెను భారం మోపుతోంది. కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కార ణంగా చమురు సరఫరా మందగించడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. నిల్వలు తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచు తూ నిర్ణయం తీసుకోగా, ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుం చే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. యుద్ధం కొనసాగుతుం దని ఇజ్రాయిల్‌కు మద్దతిస్తున్న అమెరికా ప్రకటించడంతో చమురు సరఫరా దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రస్తుతానికి గ్యాస్‌ సి లిండర్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

వంట గ్యాస్‌పై రూ. 60 వడ్డన...

కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచడంతో వంట గ్యాస్‌ రేట్‌ రూ. 60 పెరగగా, కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ. 115 వరకు పెరిగింది. గతంలో రూ.927 ధర ఉ న్న 14 కిలోల వంటగ్యాస్‌ ప్రస్తుతం పెరిగిన ధరతో కలు పుకొని రూ. 987కు చేరుకుంది. అలాగే ఇంతకు ముందు రూ. 2029గా ఉన్న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్ర స్తుతం రూ. 2144కు పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇండి య న్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కా ర్పొరేషన్‌ (బీపీసీ), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీ) కంపెనీలకు చెందిన దాదాపు రెండు లక్షల కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో ఆయా కంపెనీలకు చెందిన 16 డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు ఉండగా, మరో ఐదు కో ఆపరేటివ్‌ స్టోర్స్‌ (సింగరేణి సంస్థకు సంబంధించినవి) ఉన్నాయి. వా టి ద్వారా ప్రజలకు గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ జరుగుతుం డగా, పెరిగిన రేట్ల కారణంగా బెంబేలెత్తుతున్నారు. డోర్‌ డెలివరీ చేసిన పక్షంలో పై ధరలకు అదనంగా మరో రూ. 30 చెల్లించుకోవలసి ఉంటుంది.

ఉజ్వల పథకంపైనా పెంపు....

వంట గ్యాస్‌లో భాగంగా కేంధ్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తు న్న ఉజ్వల పథకంపైనా పెరిగిన ధరలు వర్తించనున్నాయి. గృహావసర సిలిండర్లకు సమానంగా ఉజ్వల పథకానికీ రూ. 60 ధరలు పెరిగినట్లు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. పెరి గిన ధరతో కలిపి మొత్తం రూ. 987 పథకం లబ్దిదారులు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వాలు ప్రకటించిన మేరకు స బ్సిడీ తరువాత వారి బ్యాంక్‌ అకౌంట్లలో జమ కానుంది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజాపాలన కా ర్య క్రమంలో భాగంగా వంట గ్యాస్‌పై రూ. 500 సబ్సిడీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే పెరిగిన ధరలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే రూ. 500 స బ్సిడీని బ్యాంకుల్లో జమ చేయనుంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపైనా ప్రభావం...?

యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచిన కేం ద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులైన పెట్రోలు, డీజిల్‌పైనా పెంచే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ప్రచారం జరుగు తోంది. పెట్రో ఉత్పత్తులపై ధరలు పెరిగితే సామాన్య ప్ర జానీకంపై అధనపు భారం పడనుంది. ప్రస్తుతం లీటర్‌ నార్మల్‌ పెట్రోలు ధర రూ. 108.48 ఉండగా, పవర్‌ పెట్రో ల్‌పై రూ. 116.57 ఉంది. అలాగే లీటర్‌ డీజిల్‌ ధర రూ. 96.65 ఉంది. జిల్లాలో హిందూస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌, నాయారా, రిలయన్స్‌ కం పెనీలకు చెందిన పెట్రో ఉత్పత్తుల వినియోగం జరగు తోం ది. జిల్లా వ్యాప్తంగా ఆయా కంపెనీలకు చెందిన 65 వరకు పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉండగా ప్రతినెల సగటున 6000 కిలో లీటర్ల వరకు సేల్స్‌ ఉంటాయని అంచనా. జిల్లా వ్యా ప్తంగా ప్రతీ రోజు 100 కిలో లీటర్లు పెట్రోల్‌, మరో 100 కిలో లీటర్ల వరకు డీజిల్‌ వినయోగిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కేంధ్రం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచితే వినియో గదారులపై మోయలేని భారం పడుతుంది. అయితే యుద్ధ ప్రభావం పెట్రోల్‌, డీజిల్‌పైనా ఉండబోదని ఆయా కంపె నీల ప్రతినిధులు చెబుతున్నారు. 2022లో జరిగిన రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో పరిస్థితులు ఇప్పటికంటే అధికంగా ఉండేవని, అంతటి క్లిష్ట సమయంలోనూ పెట్రో ల్‌, డీజిల్‌ ధరలు పెరగలేదని ఓ కంపెనీ ప్రతినిధి తెలి యజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెరిగే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ప్రజలపై భారం పడుతుంది...

గృహిణి నరెడ్ల రజిత, మంచిర్యాల

యుద్ద ప్రభావంతో కేంధ్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ సి లిండర్‌ ధర పెంచడం సామాన్య ప్రజలపై భారం పడు తుంది. ఇప్పటికే వంట గ్యాస్‌ ధరలు అధికంగా ఉండగా ప్రస్తుతం పెంచిన ధర, డోల్‌ డెలివరీతో కలిపి మొత్తం రూ. వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం సా మాన్య ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై రూ. 500 సబ్సిడీ ఇస్తున్నప్పటికీ అది అం దరికీ అమలయ్యే అవకాశాలు లేవు.

అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి....

ఇండేన్‌ డిస్ట్రిబ్యూటర్‌ రాచకొండ వెంకటేశ్వర్‌రావు (బుజ్జన్న)

కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్లపై పెంచిన కొత్త ధర లు ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చా యి. శనివారం నుంచి ఉదయం నుంచే బుకింగ్స్‌పై నూత న ధరలు వసూలు చేస్తున్నాం. కేంద్రం నిర్ణయం ప్రకారం వంట గ్యాస్‌పై రూ. 60 పెరగగా, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ. 114 పై చిలుకు ధరలు పెరిగాయి.

Updated Date - Mar 07 , 2026 | 11:45 PM