రోడ్డుపై చెత్త
ABN , Publish Date - Sep 21 , 2026 | 01:08 AM
రహదారిపై చెత్త వేసిన వ్యక్తికి నీలోజిపల్లి గ్రామపంచాయతీ అధికారులు రూ.500 జరిమానా విధించారు. గ్రామంలోని రోడ్ నం. 15-16 మధ్య రహదారిపై చెత్త కుప్పగా
బోయినపల్లి, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): రహదారిపై చెత్త వేసిన వ్యక్తికి నీలోజిపల్లి గ్రామపంచాయతీ అధికారులు రూ.500 జరిమానా విధించారు. గ్రామంలోని రోడ్ నం. 15-16 మధ్య రహదారిపై చెత్త కుప్పగా వేసిన గూడ అంజిరెడ్డికి పంచాయతీ కార్యదర్శి నోటీసు జారీ చేశారు. ప్రజల రాకపోకలకు, పారిశుధ్యానికి ఇబ్బంది కలిగించేలా రహదారులపై చెత్త వేయడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సంబంధిత నిబంధనల మేరకు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇకపై రహదారులు, డ్రెయిన్లు, కాలువలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో చెత్త వేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు హెచ్చరించారు.