Share News

కుల గణనలో గంగపుత్రులను చేర్చాలి

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:37 PM

కుల గణన జాబితాలో గంగపుత్ర సంఘం పేరు లేకపోవడం దారుణమని, వెంటనే చేర్చా లని కోరుతూ సోమవారం పట్టణ గంగపుత్ర సంఘం నాయకులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

కుల గణనలో గంగపుత్రులను చేర్చాలి
సబ్‌ కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న గంగపుత్ర సంఘం నాయకులు

బెల్లంపల్లి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : కుల గణన జాబితాలో గంగపుత్ర సంఘం పేరు లేకపోవడం దారుణమని, వెంటనే చేర్చా లని కోరుతూ సోమవారం పట్టణ గంగపుత్ర సంఘం నాయకులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు వంగల చక్రపాణి, కార్యదర్శి దామెర విజయ్‌, మాజీ అధ్యక్షుడు పోతరాజు లు మాట్లాడుతూ బీసీ ఏ జాబితాలో తమ సంఘం మొదటి సీరియల్‌ నెంబర్‌లో అధికారి కంగా ఉన్నప్పటికీ కుల గణనలో లేకపోవడం సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే అగ్ని కుల క్షత్రియ అనే జాబితాలో గంగపుత్రులను చేర్చారని అసహనం వ్యక్తం చేశారు. ఈ విష యంలో సీఎం రేవంత్‌రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీసీ కమీషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, ఫిషరీస్‌ కోఆపరేటివ్‌ చైర్మన్‌ సాయి కుమార్‌లు స్పందించి తమ సంఘాన్ని కుల గణన జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, మల్లేష్‌, రామస్వామి, యుగేందర్‌, రాములు, గోపాల్‌, వెంకటి, మల్లయ్య, రాజ్‌కుమార్‌, శంకర్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 11:37 PM