Share News

గంగమ్మ ఒడికి గౌరమ్మలు

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:40 PM

10 రోజులుగా పూ జలు అందుకున్న దుర్గమ్మలు బుధ వారం గంగమ్మ ఒడికి చేరాయి.

గంగమ్మ ఒడికి గౌరమ్మలు
నిమజ్జనానికి బయలుదేరిన దుర్గమ్మ

అచ్చంపేటటౌన్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : 10 రోజులుగా పూ జలు అందుకున్న దుర్గమ్మలు బుధ వారం గంగమ్మ ఒడికి చేరాయి. నియోజకవర్గంలో ఆయా గ్రామా లు, పట్టణాలలో ప్రత్యేక మండపా లను ఏర్పాటు చేసి గౌరమ్మలకు పూజలు అందించారు. బుధవారం పట్టణంలో కనుల పండుగగా గౌర మ్మల నిమజ్జన వేడుకలు జరిగాయి. సాయంత్రం ఆయా మండపాల వద్ద నిర్వా హకులు ముక్కుపుడకలతో పాటు అమ్మవారికి అలంకరణ చేరిన చీరలకు వేలం కార్యక్ర మా లు నిర్వహించారు. మహిళలు ఊరేగింపులను కోలాటాల,నృత్యాలతో ఆకట్టుకునేలా ప్రదర్శన లు నిర్వహించారు. రాత్రి వరకు గౌరమ్మల ఊ రేగింపు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా పోలీసులు గట్టి బందోబ స్తును ఏర్పాటు చేశారు. భక్తులు నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రసా దాలను పంపిణీ చేశారు. మండల పరిధిలోని బొమ్మన్‌ పల్లి గ్రామంలో అమ్మవారి ముక్కుపుడకను వేలంలో లత్తీపూర్‌ గ్రామానికి చెందిన ఎడ్మ నరేష్‌ యాద్‌ రూ. 8లక్షల 61 వేలకు దక్కించు కున్నారు

ఫ పెద్దకొత్తపల్లి, (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని దేవునితిర్మలాపూర్‌ గ్రామంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను నిమజ్జనం చేశారు. దేవీశరన్నవరాత్రుల ఉత్సవాల్లో భా గంగా 9రోజుల పాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. మం గళ వారం రాత్రి అమ్మవారిని ట్రాక్టర్‌పై అలంకరించి గ్రామం లో వీధుల గుండా తీసుకెళ్లి గ్రామ సమీపంలోని ఎంజీఎల్‌ ఐ కాల్వలో నిమజ్జనం చేశా రు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వి.సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:40 PM