Share News

పాతాళానికి చేరిన గంగమ్మ...

ABN , Publish Date - Apr 19 , 2026 | 10:14 PM

వేసవి ఎం డలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. వేడికి భూగర్భ జల సంపద అవిరవుతోంది. నీటి వినియో గం పెరగడంతో భూగర్భ జలాలు అట్టడుక్కు పడిపోతున్నాయి. జలశయాల్లో నీటి మట్టం పడిపోవ డంతో పాటు చెరువులు, కుంటలు చాలా వరకు ఎండిపోయే దశకు చేరుతున్నాయి. జి

పాతాళానికి చేరిన గంగమ్మ...

ఎడారిని తలపిస్తున్న గోదావరి తీర ప్రాంతం

పొంచి ఉన్న నీటి సమస్య..

ముదురుతున్న ఎండలు....

నస్పూర్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : వేసవి ఎం డలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. వేడికి భూగర్భ జల సంపద అవిరవుతోంది. నీటి వినియో గం పెరగడంతో భూగర్భ జలాలు అట్టడుక్కు పడిపోతున్నాయి. జలశయాల్లో నీటి మట్టం పడిపోవ డంతో పాటు చెరువులు, కుంటలు చాలా వరకు ఎండిపోయే దశకు చేరుతున్నాయి. జిల్లాలో భూగ ర్భ జల సంపద పాతాళానికి పడిపోతోంది. రాను న్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకా శం ఉన్నందున నీటి కోసం ఇబ్బందులు తప్పేలా లేవు. గోదావరి నది ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు ని ర్మాణంతో దిగువకు నీటి ప్రవాహం తగ్గిపోయింది. వే సవిలో గోదావరి నది నీటి ప్రవాహం లేకపోవ డం తో దిగువ ప్రాంతమంతా ఏడారి తలపిస్తోంది. ఏ ప్రిల్‌ మాసంలోనే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే రోజు ల్లో ఎండలు మరింత పెరిగితే ఇబ్బందులు ఎదుర య్యే అవకాశం ఉన్నది. సాగు నీరైనా, తా గునీరైనా తీర ప్రాంతమంతా గోదావరి నది నీటిపై నే ఆధార పడి ఉంటుంది. గోదావరినదిలో నీటి ల భ్యత లేక తీర ప్రాంత వాసులుకు నీటి సమస్యను తెచ్చింది.

ఫ ఏఏ ప్రాంతాల్లో ...

గోదావరి నది తీర ప్రాంతాలు దాహార్తితో తల్లడి ల్లిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎండల తీవ్రత కు గణనీయంగా పడిపోయిన భూగర్భ జల సంప ద అడుగంటిపోతున్నాయి. జిల్లాలో జలమట్టం స గటు 6.32 మీటర్ల దిగువకు కాగా అత్యధికంగా కో టపల్లిలో 17.54 మీటర్లు, కుందారంలో 18.04 మీ టర్ల దిగువకు నీటిమట్టం పడిపోయింది. బెల్లంప ల్లిలో 13.30 మీటర్లు, భీమిని-2.13 మీటర్లు, చె న్నూరు-6.94 మీటర్లు, కొమ్మెర-1.39, దండెపల్లి- 4.02, హాజీపూర్‌-4.16, జైపూర్‌-4.0, కుందారం -18. 04, ఇందనపల్లి-5.06, జనాకపూర్‌-0.01, కోటపల్లి-17.54 మీటర్లు, లక్ష్సెటిపేట-2.76 మీటర్లు, మందమర్రి-4.93 నస్పూర్‌-9.22, మీటర్ల లోతున జలం ఉంది. వినియోగం బాగా పెరగడంతో పాటు ఎండలు మరింత ఎక్కువైతే భూగర్భ జలం దిగు వకు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

ఫ ఇంటింటా ఇంకుడు గుంత అవసరం...

గృహాలను నిర్మించుకునే సమయంలో ఇంటి పరిసరాల్లో పడే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇం కించడానికి ఇంకుడు గుంతలను ఏర్పాటు పై ప్రజ లకు చైతన్యం తేవాలి. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలే శరణ్యమని ప్రజల కు అవగా హన కల్పించాలి. ఇంకుడు గుంతల ఆవశ్యకత ప్ర యోజనాలను కూలంకుశంగా ప్రజలకు ఎప్పటిక ప్పుడు వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్న ది. సుమారు వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే నిర్మాణంలో 1.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 6 క్యూబిక్‌ మీటర్ల లోతు తవ్వి ఇంకుడు గుంతలను నిర్మించాలి.

ఫ సింగరేణి ప్రాంతాలకు గోదావరి నీరు...

సీతారాంపల్లి గోదావరి నది నుంచి శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి లోని సింగ రేణి ప్రాంతాలకు తాగునీటిని యాజమాన్యం అంది స్తుంది. బెల్లంపల్లి రిజియన్‌ పరిధిలోని కార్మిక కాల నీలకు తాగునీటి అవసరాలకు గోదావరి నుంచి ప్రతీ రోజు 30 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నా రు. గోదావరి నదిలో నీటి లభ్యత సరిగా లేకపోవ డం వలన ఇన్‌టెక్‌ వెల్‌ వరకు ఇసుకలో కాలువలు తవ్వి నీటి ఇన్‌టెక్‌ వెల్‌ అందిస్తున్నారు. అంతే కా కుండా నదిలోపల వరకు ఇసుకలో ఇన్‌ ఫిల్టర్‌ వెల్స్‌ను కూడా యాజమాన్యం నిర్మించింది. ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు పైపులైన్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నీటి సమస్య త లెత్తలేదు. రానున్న రోజుల్లో నీటి సమస్య వస్తే ప్రత్యామ్నాయంగా కార్మిక కాలనీలకు ఓ పూట గనుల నీటిని సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 10:14 PM